జగన్‌కు దెబ్బ మీద దెబ్బ!
ABN, Publish Date - Sep 21 , 2024 | 03:45 AM
వైసీపీ.. ముఖ్య నేతలు, స్థానిక ప్రజాప్రతినిధుల వలసలతో విలవిలలాడుతోంది. ఇలాంటి తరుణంలో తిరుమల లడ్డూలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని వెలుగులోకి రావడం, భక్తులు,
వైసీపీ.. ముఖ్య నేతలు, స్థానిక ప్రజాప్రతినిధుల వలసలతో విలవిలలాడుతోంది. ఇలాంటి తరుణంలో తిరుమల లడ్డూలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని వెలుగులోకి రావడం, భక్తులు, మఠాధిపతు లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తుండడం.. కేంద్ర ప్రభు త్వం తీవ్రంగా పరిగణిస్తుండడం ఆ పార్టీని.. ముఖ్యం గా జగన్‌ను ఆత్మరక్షణలోకి నెట్టింది. దెబ్బమీద దెబ్బ పడుతుండడంతో హడలిపోతున్నారు. జగన్ హ యాంలో టీటీడీ భ్రష్టుపట్టిందని, అన్యమతస్థులను తీసుకొచ్చి పాలక మండలి బాధ్యతలు అప్పగించారన్న ఆరోపణలు ఉన్నాయి. లడ్డూ, అన్న ప్రసాద నాణ్యతపై విమర్శలు వచ్చినప్పుడల్లా పాలక మండలి ఎదురుదాడికి దిగేది. కనీసం అంతర్గత విచారణ చేపట్టినా నిజానిజాలు తెలిసిఉండేవని.. వైసీపీ నేతలు అంటున్నారు.
Updated Date - Sep 21 , 2024 | 03:45 AM