ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వర్షానికి నేలరాలిన అండుకొర్ర

ABN, Publish Date - Oct 17 , 2024 | 11:34 PM

మండలంలో మూడు రోజులు గా ఎడతెరపిలేని వర్షం కారణంగా అండుకొర్ర పూర్తిగా దెబ్బతింది. నడిమికుంటపల్లిలో వెంకటరమణారెడ్డి ఈ ఖరీఫ్‌లో ఐదు ఎకరాల్లో ఈ పంట సాగుచేశాడు

పొలంలోనే రాలిపోయిన పంట

తనకల్లు, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) : మండలంలో మూడు రోజులు గా ఎడతెరపిలేని వర్షం కారణంగా అండుకొర్ర పూర్తిగా దెబ్బతింది. నడిమికుంటపల్లిలో వెంకటరమణారెడ్డి ఈ ఖరీఫ్‌లో ఐదు ఎకరాల్లో ఈ పంట సాగుచేశాడు. పంట గింజ పట్టే సమయంలో వర్షం రాకపోవడంతో జనజాగృతి సహకారంతో పక్క రైతుల నుంచి నీటి తడులు ఇచ్చారు. దీంతో పంట బాగా పండింది. ఎకరా పొలంలో ఒక రోజు పంటను కోసి మోపులు కట్టారు. మిగిలిన పంట కోస్తుండగా వర్షాలు ప్రారంభమయ్యాయి. కోసి కుప్పగా వేసిన పంట మొత్తం కుళ్లిపోయింది. మిగిలిన నాలుగు ఎకరాల్లోని పంట పూర్తిగా రాలిపోయింది. దీంతో తనకు రూ. నాలుగు లక్షల వరకు నష్టం జరిగిందనిరైతు వాపోతున్నాడు.

Updated Date - Oct 17 , 2024 | 11:34 PM