సమస్య పరిష్కరించని నేతలెందుకు ?
ABN, Publish Date - Jan 29 , 2024 | 12:07 AM
‘ఎన్నికల్లో మాత్రమే మా గ్రామానికి వస్తారు. మీ సమస్యలు పరిష్కరి స్తామని చెప్పి ఓట్లు వేయించుకుంటారు. మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు మా గ్రామం వైపు చూడరు. స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు అయినా మా గ్రామానికి మట్టిరోడ్డే దిక్కు. తారు రోడ్డు వేసిన నాయకుడేలేడని, అలాంటి నాయకులు మాకొద్దు.’ అంటూ మండలం లోని మోటువారిపల్లిలో గ్రా మస్థులు మంత్రిని నిలదీశారు.
మోటువారిపల్లి వాసుల ఆగ్రహం
పెనుకొండ రూరల్, జనవరి 28: ‘ఎన్నికల్లో మాత్రమే మా గ్రామానికి వస్తారు. మీ సమస్యలు పరిష్కరి స్తామని చెప్పి ఓట్లు వేయించుకుంటారు. మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు మా గ్రామం వైపు చూడరు. స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు అయినా మా గ్రామానికి మట్టిరోడ్డే దిక్కు. తారు రోడ్డు వేసిన నాయకుడేలేడని, అలాంటి నాయకులు మాకొద్దు.’ అంటూ మండలం లోని మోటువారిపల్లిలో గ్రా మస్థులు మంత్రిని నిలదీశారు. గ్రామంలో రోడ్డు, తాగునీటి సమస్య పరిష్క రించకపోతే ఎన్నికలు బహిష్కరిస్తామని మంత్రి ఉషశ్రీచరణ్ మొహంపైనే గ్రామస్థులు తేల్చి చెప్పారు. మంత్రి ఉషశ్రీ చరణ్ ఆదివారం వైసీపీ నాయ కులు, కార్యకర్తలతో కలిసి మండలంలోని మోటువారిపల్లి లో ఆత్మీయ పలకరింపు సమావేశానికి వెళ్లారు. మంత్రి గ్రామంలోకి వెళ్లగానే గ్రామస్థులు కాన్వాయిని చుట్టుముట్టా రు. తమ గ్రామంలో నాలుగు నెలలుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, రోడ్డు సౌకర్యం లేదని మంత్రిని నిలదీ శారు. వాగ్దానాలు చేస్తారేకానీ తమ సమస్యలు పరిష్క రించరని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోరా అంటూ మంత్రి ఉషశ్రీపై మండిపడ్డారు. తమ సమస్యలు పరిష్కరించ కపోతే ఎన్నికలు బహిస్కరిస్తామంటూ గ్రామస్థులు మం త్రిపై, నాయకులపై మండిపడ్డారు. గ్రామస్థుల ప్రశ్నలతో మంత్రి మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు.
గ్రామానికి మట్టిరోడ్డే దిక్కు
మోటువారిపల్లిలో 150కుటుంబాలున్నాయి. 600జనాభా ఉంది. రెండు బోరు బావుల్లో ఒక్కటి మాత్రమే పనిచే స్తోంది. ఆర్నెల్లుగా గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని నాయకులకు, అధికారులకు చెప్పినా సమస్య పరిష్కరించలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లయినా మా గ్రామానికి మట్టిరోడ్డే దిక్క న్నారు. గర్భిణులు, బాలింతలు ఈ రోడ్డులో ప్రయాణించాలంటే తీవ్ర నరకయాతన అనుభవి స్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా అనారోగ్యం పాలై 108కు ఫోనచేస్తే మీ గ్రామానికి రోడ్డు సరిగాలేదని వారు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. సమస్యలు పరిష్కరించేంతవరకు తాము ఎన్నికలు బహిష్కరిస్తామని గ్రామస్థులు మండిపడ్డారు.
రోడ్డు వేయకపోతే ఎన్నికలు బహిష్కరిస్తాం - అనసూయమ్మ, మోటువారిపల్లి
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లవుతోంది. ఇప్పటి వరకు మా గ్రామానికి తారు రోడ్డులే దు. నాయకులు, అధికారులు మా సమస్య పరిష్కరించలేదు. మా సమస్యలు పరిష్కరించ కపోతే ఎన్నికలు బహిష్కరిస్తాం.
సమస్య పరిష్కరించని వారు మాకొద్దు - మంగమ్మ, మోటువారిపల్లి
ఆర్నెల్లుగా గ్రామంలో తీవ్ర తా గునీటి సమస్య ఉంది. అధికారు లకు, నాయకులకు చెబుతు న్నాం. ఎన్నికలప్పుడు మాత్రం సమస్య పరిష్కరిస్తామని మాటిస్తారు. ఎన్నికల తరువాత గ్రామంవైపు తిరిగి చూడరు. సమస్య పరిష్కరించలేని నాయకులు మాకొద్దు.
ఆడపిల్లలు పైచదువులకు వెళ్లలేకపోతున్నారు - చంద్రిక, సరోజమ్మ, మోటువారిపల్లి
అమ్మవారిపల్లి జా తీయ రహదారి నుంచి మా గ్రామాని కి వెళ్లాలంటే 5కి.మీ. అవుతుంది. కొన్నేళ్ల నుంచి మట్టిరోడ్డే ఉం ది. వర్షాకాలంలో అమ్మ వారిపల్లి, గుట్టూరుకు రహదారిలో ప్రయాణించాలంటే గర్భిణులు, బాలింతలు చాలాబాధలు అనుభవిస్తున్నారు. అనేకసార్లు ఆ రహదారిలో ప్రమాదాలు జరిగే గాయాల పాలయ్యాం. రోడ్డు సరిగా లేకపోవడంతో విద్యార్థులు 10వ తరగతి వరకు చదివి, ఆపై చదువులు మానేస్తున్నారు. మా గ్రామానికి ఆటోకూడా రాదు. కాలినడకనే ప్రయా ణించాలి. మౌలిక సదుపాయాలు లేని మా గ్రామానికి ఆడపిల్లను ఇచ్చేవారు జంకుతున్నారు.
Updated Date - Jan 29 , 2024 | 12:07 AM