ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైసీపీలో సామాజిక న్యాయం ఎక్కడ?

ABN, Publish Date - Jan 12 , 2024 | 12:00 AM

వైసీపీ ఐదేళ్ల పాలనలో బీసీ సామాజిక న్యాయం ఎక్కడా పాటించలేదని, నమ్ముకున్న వారికి తీరని అన్యాయం జరుగుతోందని మాజీ ఎంపీ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిమ్మల కిష్టప్ప పేర్కొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న నిమ్మల కిష్టప్ప

మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప

గోరంట్ల, జనవరి 11: వైసీపీ ఐదేళ్ల పాలనలో బీసీ సామాజిక న్యాయం ఎక్కడా పాటించలేదని, నమ్ముకున్న వారికి తీరని అన్యాయం జరుగుతోందని మాజీ ఎంపీ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిమ్మల కిష్టప్ప పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఆయన నివాసంలో గు రువారం విలేకర్ల సమావేశంలో మా ట్లాడారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని పద్మశాలి చేనేత వర్గీయుడు కర్నూల్‌ ఎంపీ సంజీవ్‌కుమార్‌కు టిక్కెట్‌ ఇవ్వకుండా మొండిచేయి చూపారన్నారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన నలుగురిని అడ్డుపెట్టుకు ని జగన పాలన సాగిస్తూ, బీసీలకు న్యాయం చేస్తున్నట్లు కేవలం ఆర్భాటా లు చేస్తున్నారన్నారు. బీజే సంక్షేమానికి వ53 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా, నిధులు ఇవ్వకుండా అభివృద్ది ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వంలో బీసీలు ఎంతో అభివృద్ధి చెందారన్నారు. అనంతపురం జిల్లాలో బీసీలైన కాలువ శ్రీనివసులు, బీకే పార్థసారఽథి, తాను ఇందుకు నిదర్శనమ ని అందరికీ తెలుసున్నారు. తాను ఓ మండలాధ్యక్షుడిగా గద్దె నెక్కి ఎమ్మె ల్యే, మంత్రిగా, ఎంపీగా ఎదిగిన తన విషయాన్ని గుర్తు చేశారు. మాకు పార్టీలో పదోన్నతలేకానీ, ట్రాన్సఫర్లు ఉండవర్నారు. ఇప్పటికైనా జగన బుద్ధితెచ్చుకుని సామాజిక న్యాయం కోసం చేనేతలకు ప్రాధాన్య మివ్వాలని డిమాండ్‌ చేశారు. సర్వేలన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నా యని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ భూస్థాపితమవుతుందన్నారు. సామాజిక న్యాయం కోసమే చేనేత వర్గీయులకు అధిక శాతం టిక్కెట్లు ఇవ్వాలని కోరారు. టీడీపీలో ఎప్పటికీ సామాజిక న్యాయం ఉందన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:00 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising