ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

job fair జాబ్‌ మేళాను వినియోగించుకోండి

ABN, Publish Date - Oct 27 , 2024 | 12:55 AM

పట్టణంలోని శ్రీశంకరానందగిరి స్వామి డిగ్రీ కళాశాలలో ఈనెల 29వ తేదీన రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్ధ ఆధ్వర్యంలో జాబ్‌మేళా జరగనుందని, నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్‌ గోపాల్‌ సూచించారు.

గుంతకల్లుటౌన, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని శ్రీశంకరానందగిరి స్వామి డిగ్రీ కళాశాలలో ఈనెల 29వ తేదీన రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్ధ ఆధ్వర్యంలో జాబ్‌మేళా జరగనుందని, నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్‌ గోపాల్‌ సూచించారు.


కళాశాలలో శనివారం ఆయన బాజ్‌మేళా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఈ జాబ్‌ మేళాలో 13 కంపెనీలు పాల్గొననున్నాయన్నారు. హాజరయ్యే నిరుద్యోగ యువత విద్యార్హతల సర్టిఫికెట్లు తీసుకు రావాలన్నారు. టెన్త, ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమా, ఫార్మసీ, ఏదైనా డిగ్రీ చదవి 18నుంచి 30 ఏళ్ల లోపు వయసున్న వారు అర్హులన్నారు. జాబ్‌మేళా ఉదయం 9.30గంటలకు ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో ఐక్యు ఏసీ కోఆర్డినేటర్‌ రాకేష్‌, కెరియర్‌ ప్రమోషన సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వరప్రసాద్‌, ఏపీఎ్‌సఎ్‌సడీసీ కోఆర్డినేటర్‌, ప్లేస్‌మెంట్‌ సెల్‌ శిక్షణ అధికారి బాలగంగాఽధర్‌తిలక్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Oct 27 , 2024 | 12:55 AM