వైసీపీ పాలనలో బీసీల అణచివేత
ABN, Publish Date - Jan 29 , 2024 | 12:16 AM
బుక్కపట్నం, జనవరి 28: వైసీపీ పాలనలో బీసీలు అ ణచివేతకు గురయ్యారని టీడీపీ జిల్లా కా ర్యదర్శి సామకోటి ఆదినారాయణ తెలిపారు. మండలంలోని జానకంపల్లిలో ఆదివారం ఆయన పార్టీ ఆ దేశాల మేరకు బీసీల స మావేశం నిర్వహించారు.
బుక్కపట్నం, జనవరి 28: వైసీపీ పాలనలో బీసీలు అ ణచివేతకు గురయ్యారని టీడీపీ జిల్లా కా ర్యదర్శి సామకోటి ఆదినారాయణ తెలిపారు. మండలంలోని జానకంపల్లిలో ఆదివారం ఆయన పార్టీ ఆ దేశాల మేరకు బీసీల స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో బీసీలు అన్నివిధాలుగా అణచివేతకు గురయ్యారన్నారు. జగన ప్రభుత్వం బీసీలపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. టీడీపీలోనే బీసీలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందారన్నారు. టీడీపీ పాలనలో బీసీలకు ప్రత్యేక చట్టం, బీసీ కార్పొరేషన ఏర్పాటు చేశారన్నారు. వైసీపీ పాలనలో బీసీ కార్పొరేషన నిధులు మంజూరు చేయకపోగా, వచ్చిన అరకొర నిధులు కూడా పక్కదారి పట్టాయని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో జగన ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి బడుగులందరూ ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. టీడీపీ గెలుపునకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ నాయకులు నారాయణస్వామి, చెన్నప్ప, రమణ, గంగాద్రి, వెంకటరాముడు, నాగరాజు, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 29 , 2024 | 12:16 AM