Selection for state level competitions రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ABN, Publish Date - Oct 25 , 2024 | 12:11 AM
పట్టణంలో ని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యారు.
కళ్యాణదుర్గం రూరల్, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): పట్టణంలో ని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యారు.
ఆరో తరగతి విద్యార్థి నిఖిల్ కుమార్, ఏడో తరగతి విద్యార్థిని అమృ త ఇటీవల అనంతపురం ఆర్డీటీ క్రీడా మైదానంలో జరిగిన జిల్లా స్థాయి హాకీ పోటీల్లో పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు పీడీ శివమ్మ తెలిపారు. వీరు నవంబరు 8, 9, 10వ తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని చెప్పారు. ఆ విద్యార్థులను గురువారం ఉపాధ్యాయులు అభినందించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..
Updated Date - Oct 25 , 2024 | 12:11 AM