మార్పు కోరుతున్న ప్రజలు
ABN, Publish Date - Jan 29 , 2024 | 12:11 AM
ప్రజలు వైసీపీ పాలన పట్ల విసిగి వేసారిపోయి, మార్పు కోరుకుంటున్నారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ జేసీ అశ్మితరెడ్డి పేర్కొన్నారు.
తాడిపత్రి మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి
పెద్దవడుగూరు, జనవరి28: ప్రజలు వైసీపీ పాలన పట్ల విసిగి వేసారిపోయి, మార్పు కోరుకుంటున్నారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ జేసీ అశ్మితరెడ్డి పేర్కొన్నారు. మండలకేంద్రంలో ఆదివారం వారు చేపట్టిన బస్సుయాత్ర ప్రధాన రహదారుల్లో సాగింది. ప్రభాకర్‌రెడ్డికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. చేనేత కాలనీలో పర్యటించిన ఆయన అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులే తప్ప ప్రస్తుత ప్రభుత్వంలో మచ్చుకైనా ఒక్క అభివృద్ధి పని కూడా లేదని కాలనీ మహిళలు ప్రభాకర్‌రెడ్డికి తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే మండలంలో అభివృద్ధిని పట్టాలు ఎక్కిస్తామని వారికి ప్రభాకర్‌రెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చవ్వా గోపాల్‌రెడ్డి, లీలావతి, కేశవరెడ్డి, కొండూరు కేశవరెడ్డి, పుట్లూరు లక్ష్మికాంతరెడ్డి, గంగరాజుయాదవ్, దివాకర్‌రెడ్డి, ప్రసాద్‌యాదవ్, దస్తగిరి, బాలిరెడ్డి, నాగరాజు, చిరంజీవులు, తిలక్‌కుమార్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, నాగేశ్వర్‌రెడ్డి, వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.
జనసంద్రంగా ముగింపు ర్యాలీ
తాడిపత్రి మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి చేపట్టిన యువచైతన్య బస్సుయాత్ర ముగింపు ర్యాలీ జనసంద్రంగా మారింది. మండలంలో 12రోజులపాటు బస్సుయాత్ర జరిగింది. మండలంలోని 40గ్రామాల నుంచి నాయకులు, ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా మండలకేంద్రానికి తరలివచ్చారు. ర్యాలీలో పాల్గొన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి, టీడీపీ ఇనచార్జ్ జేసీ అశ్మితరెడ్డిలు సైకో పోవాలి సైకిల్ రావాలి అన్న పాటకు స్టెప్పులు వేస్తూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు.
Updated Date - Jan 29 , 2024 | 12:11 AM