Paddy fields washed down by rain వర్షానికి నేలకొరిగిన వరిపైర్లు
ABN, Publish Date - Oct 25 , 2024 | 12:09 AM
ఎడతెరపి లేని వర్షం రైతుల కు తీరని నష్టాలనే మి గిల్చింది. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి పామిడి పట్టణంలోని వరిపైర్లు నేలకొరిగాయి.
పామిడి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ఎడతెరపి లేని వర్షం రైతుల కు తీరని నష్టాలనే మి గిల్చింది. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి పామిడి పట్టణంలోని వరిపైర్లు నేలకొరిగాయి.
దీంతో వరిపంటను సా గు చేస్తున్న రైతులకు తీరని శోకం మిగిలింది. కోత దశలో ఉన్న వరిపైర్లు వర్షానికి నేలకు ఒరగడంతో ఆయా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎద్దులపల్లి రోడ్డు లో కౌలు రైతు మల్లికార్జునకు చెందిన ఐదు ఎకరాలలో వరిపైరు పూర్తిగా నేలకొరిగింది. దీంతో ఆ రైతు కన్నీరు మున్నీరయ్యాడు. ఈ అకాల వర్షం వల్ల తనకు సుమారు రూ. లక్ష నష్టం వాటిల్లిందని వాపోయాడు. ప్రభుత్వం అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని పలువురు కోరారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..
Updated Date - Oct 25 , 2024 | 12:09 AM