నవరత్నాలు కాదు.. రాళ్లు: కందికుంట
ABN, Publish Date - Jan 29 , 2024 | 12:14 AM
నంబులపూలకుంట, జనవరి 28: వైసీపీ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని, సీఎం జగన ప్రవేశపెట్టినవి నవరత్నాలు కాదని, అవి రాళ్లని, వాటి వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని టీడీపీ నియోజకవర్గ కందికుంట వెంకటప్రసాద్ విమర్శించారు.
- వైసీపీ నుంచి టీడీపీలోకి పలువురి చేరిక
నంబులపూలకుంట, జనవరి 28: వైసీపీ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని, సీఎం జగన ప్రవేశపెట్టినవి నవరత్నాలు కాదని, అవి రాళ్లని, వాటి వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని టీడీపీ నియోజకవర్గ కందికుంట వెంకటప్రసాద్ విమర్శించారు. మండలంలోని వెలిచెలమల క్రాస్‌లో ఆదివారం టీడీపీ నాయకుల, కార్యకర్తల సమావేశం జరిగింది. ఇందుకు కందికుంట విచ్చేశారు. ఆయన రాగానే స్థానిక నాయకులు బైక్‌ర్యాలీతో, పూలమాలలు, హారతులతో స్వాగతం పలికారు. అనంతరం సమావేశంలో పలువురు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. వారికి కందికుంట కండువాలు వేపి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నవరత్నాలు కాదని, రాళ్లు అని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేరన్నారు. ఈ ప్రభుత్వంలో అన్నీ సమస్యలు, కష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎనపీ కుంట మండలం టీడీపీకి పెట్టని కోట అన్నారు. ఇక్కడి ప్రజలు టీడీపీని ఎంతో ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. హంద్రీనీవా కాలువల ద్వారా ఈప్రాంతాన్ని సస్యశ్యామల చేశామని అధికారపార్టీ నాయకులు చెబుతున్నారని, 90 శాతం పనులను గత టీడీపీ హయాంలో పూర్తి చేస్తే, కనీసం 10 శాతం పనులు కూడా వైసీపీ ప్రభుత్వం పూర్తిచేయలేకపోయిందని మండిపడ్డారు. కాంట్రాక్టులు సైతం చేసిన పనులకు బిల్లులు అందక అప్పుల ఉబిలో కూరుకుపోయారన్నారు. ఎన్నికల హామీలను ఏ ఒక్కటీ సరిగా అమలు చేయలేదని దుయ్యబట్టారు. రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పథంలో నడవాలంటే చంద్రబాబు సీఎం కావాలని చెప్పారు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయానికి సహకరించాలని కోరారు. పార్టీలో చేరినవారిలో మాజీ సర్పంచ భర్త రఘునాథ్‌రెడ్డి, జనార్ధనయాదవ్, చిన్నయ్య, సొసైటీ మాజీ డైరెక్టర్ గంగిరెడ్డి, వైసీపీ యూత కన్వీనర్ వేణుగోపాల్, భాస్కర్‌తోపాటు 40కుటుంబాల వారు చేరారు. కార్యక్రమంలో కన్వీనర్ చంద్రశేఖర్‌నాయుడు, విజయ్‌కుమార్‌యాదవ్, బసిరెడ్డి, నాగేశ్వర్, వెంకటయ్య, బాబు, చిన్నరమయ్య, పోమేనాయక్, నాయకులు, రాజశేఖర్‌బాబు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - Jan 29 , 2024 | 12:14 AM