అరాచకపాలనకు చరమగీతం పాడుదాం: బీకే
ABN, Publish Date - Mar 29 , 2024 | 11:48 PM
రాష్ట్రంలోని అవినీతి అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు కంకణబద్ధులు కావాలని టీడీపీ హిందూపురం పార్లమెంట్ అఽభ్యర్థి బీకే పార్థసారథి పిలుపునిచ్చారు.
రొద్దం, మార్చి 29: రాష్ట్రంలోని అవినీతి అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు కంకణబద్ధులు కావాలని టీడీపీ హిందూపురం పార్లమెంట్ అఽభ్యర్థి బీకే పార్థసారథి పిలుపునిచ్చారు. మండలంలోని ఆర్.మరువపల్లి పార్థసారథి రైస్ మిల్లులో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, దుర్మార్గుల దుష్టుల పాలనను అంతమొందిద్దామని, ఇసుక, మద్యం, మైనలలో వేల కోట్లు దోచుకున్న ఘనచరిత్ర వైసీపీదేనన్నారు. ప్రతి నాయకుడు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుని గ్రామంలో ప్రచారం చేయాలని బీకే సూచించారు. ఎమ్మెల్యే అభ్యర్థి సవిత మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలేదేవుళ్లు అన్న నినాదంతో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావు తెలుగురాష్ట్రాల ప్రజల కోసం పరితపించారన్నారు. ఆయన స్ఫూర్తితోనే మహిళా సాధికారత కోసం చంద్రబాబు నాయుడు ఎంతో కృషిచేశారన్నారు. ఎంతో మంది నాయకులు మారినా టీడీపీ కార్యకర్తలు మారలేదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఒక్క చాన్స పేరుతో అధికారంలోకి వచ్చారన్నారు. తనను సైతం అక్రమ కేసుల్లో ఇరికించారన్నారు. కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, నియోజకవర్గ అధ్యక్షుడు చిన్నప్పయ్య, అధికార ప్రతినిధి నరసింహులు, కన్వీనర్ నరహరి, మాధవనాయుడు, టైలర్ ఆంజనేయులు, చంద్రమౌళి, వెంకటరామిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ నరసింహులు, హరీష్, మురళి పాల్గొన్నారు.
20 కుటుంబాలు టీడీపీలోకి
నారనాగేపల్లి, కనుమర గ్రామాలకు చెందిన 20 వైసీపీ కుటుంబాలు టీడీపీలోకి బీకే పార్థసారథి, సవిత ఆహ్వానించారు. శుక్రవారం ఆర్.మరువపల్లిలోని రైస్ మిల్లులో వైసీపీ కుటుంబ సభ్యులను టీడీపీలోకి కండువాలు వేసి ఆహ్వానించారు. టీడీపీలో చేరిన వారిలో నారనాగేపల్లి మాజీ డీలర్ నాగిరెడ్డి, వలంటీరు రాజశేఖర్, విద్యాకమిటీ చైర్మనలు సోమిరెడ్డి, మాజీ చైర్మన సుబ్బరాయుడు, గోపాల్, యుగంధర్, వీరాంజి, అంజినప్ప, రఫీ, కుమార్, ముత్యాలప్ప, రుద్రన్న, కనుమర గ్రామం నుంచి లక్ష్మయ్య, సోమశేఖర్, సంజీవప్ప, లక్ష్మీనారాయణ, వార్డుమెంబర్ హనుమంతు, చిన్న అంజినప్ప, లక్ష్మన్న, రాము తదితరులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నారనాగేపల్లి మాజీ సర్పంచ నాగభూషణం, మనోహర్, గోవిందు, హనుమంతు పాల్గొన్నారు.
Updated Date - Mar 29 , 2024 | 11:48 PM