ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

భక్తుల ఆరాధ్యదైవం కనుమ లక్ష్మీనరసింహుడు

ABN, Publish Date - Mar 24 , 2024 | 12:01 AM

ప్రతి సంత్సరం భక్తి శ్రద్ధలతో అం గరంగ వైభవంగా నిర్వహించే క నుమ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మ రథోత్సవం కోసం ఆలయ కమీటీతో పాటు అధికారులు ఏర్పాట్లు చేస్తు న్నారు.

క నుమ లక్ష్మీనరసింహస్వామి మూలవిరాట్‌

రేపు బ్రహ్మరథోత్సవం

చిలమత్తూరు, మార్చి 23: ప్రతి సంత్సరం భక్తి శ్రద్ధలతో అం గరంగ వైభవంగా నిర్వహించే క నుమ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మ రథోత్సవం కోసం ఆలయ కమీటీతో పాటు అధికారులు ఏర్పాట్లు చేస్తు న్నారు. మండల ప్రజల ఆరాధ్య దై వమైన శ్రీభూనీళా సమేత కనుమ లక్ష్మీనరసింహస్వామి బ్రహోత్స వాలు ఈ నెల 21 నుంచి ప్రారంభ మయ్యాయి. ఈ సందర్భంగా స్వా మి వారికి నిత్య పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు, ధవనోత్స వం, దీపోత్సవం, హనుమంత వాహనోత్సవం నిర్వహించారు. ఆదివారం భక్తులకు అత్యంత విశిష్టమైన స్వామి వారి కల్యాణో త్సవం నిర్వహించనున్నట్లు అర్చకు లు తెలిపారు. మధ్యాహ్నం 11 గంటల నుంచి 11.45 గంటల లోగా అభిజిత లగ్నాన భూదేవి, శ్రీదేవి సహిత స్వామి వారి కల్యాణం జరుగుతుందన్నారు. అనంతరం అదేరోజు సాయంత్రం 6 గంటలకు సహస్ర దీపాలంకరణ, గరుడ వాహనోత్సవం నిర్వహిస్తామన్నారు. అలాదే ఈ నెల 25న సోమవారం స్వామి వారి బ్రహ్మరథోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం 26న ముత్యాల పల్లకి సేవ, దోపుతిరునాళ్లు, 27న వసంతోత్సవం, ధ్వజావరోహణం, ఉయ్యాలో త్సవం జరుగుతాయన్నారు. ఈనెల 28న శయనోత్సవం, పుష్పయాగోత్సవం, 29న సుప్రబాతసేవతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు.

రథోత్సవానికి ఏర్పాట్లు

కనుమ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మరథోత్సవం ఈ నెల 25న జరుగు తుంది. ఈ సందర్భంగా 36 అడుగుల ఎత్తు కలిగిన బ్రహ్మరథంలో స్వామి వారు దేవేరులతో ఆసీనులై మండల కేంద్రంలోని ప్రధాన వీధుల్లో ఊరేగు తారు. ఆల యంలో ఉన్న స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో తీసుకొచ్చి రథంపై ఆశీనులను చేస్తారు. ఇప్పటికే ఆలయ సేవకులు బ్రహ్మరథానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవా నికి సిద్ధం చేశారు. బ్రహ్మరథోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్‌ఐ గంగాధర్‌ తెలిపారు. ట్రాఫిక్‌ని క్రమబద్ధీకరిస్తూ, వాహనాలను దారి మళ్లించే ఏర్పాట్లుపై సమీక్షించారు.

ఎన్నికల కోడ్‌తో రాజకీయాలకు నో ఎంట్రీ

సాధారణంగా ప్రతి సంవత్సరం రథోత్సవానికి ముఖ్య అతిథులుగా రాజకీయ నాయకులను స్థానికులు అహ్వానిస్తుంటారు. వారు వచ్చిన సందర్భాల్లో బాణసం చా కాల్చడం, ప్లెక్సీలు పెట్టడం, ఆయా నాయకులకుతో ఊరేగింపుగా వెళ్లడం, పార్టీలకు మద్ధతుగా నినాదాలు చేయడం జరిగేది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో ఎన్నికల నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించాలని ఇప్పటికే రాజకీయ నాయకులకు అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

Updated Date - Mar 24 , 2024 | 12:01 AM

Advertising
Advertising