ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వృద్ధురాలికి చేయూత

ABN, Publish Date - Mar 29 , 2024 | 12:46 AM

తనకల్లు, మారి, 28: మండలంలోని దేవలంతండా సమీపంలో రోడ్డు పక్కన ఓ అనాథ వృద్ధురాలిని ఎవరో నాలుగు రోజులక్రితం వదలి వెళ్లారు. అప్పటి నుంచి ఆమె రోడ్డు పక్కనే ఉండిపోయింది.

తనకల్లు, మారి, 28: మండలంలోని దేవలంతండా సమీపంలో రోడ్డు పక్కన ఓ అనాథ వృద్ధురాలిని ఎవరో నాలుగు రోజులక్రితం వదలి వెళ్లారు. అప్పటి నుంచి ఆమె రోడ్డు పక్కనే ఉండిపోయింది. ఈ విషయాన్ని పక్కనే ఉన్న మామిడి తోట యజమానికి ము నీర్‌ 100కు కాల్‌ చేసి సమాచారం అందించారు. అయినా ఎవరూ స్పందించలేదు. గురువారం కోటపల్లి గ్రామ సచివాలయ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ రంజిత కొక్కంటి క్రాస్‌లోఉన్న వందేమాతరం టీమ్‌కు సమాచారం అందించారు. టీమ్‌ సభ్యులు అశోక్‌, గజేంద్ర, శ్రీనివాసులు తదితరులు వృద్ధురాలి వద్దకు చేరుకుని అమడగూరు మండలంలోని శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమానికి తరలించడానికి ఆశ్రమ నిర్వాహకురాలు అరుణజ్యోతితో సంప్రదించారు. నిర్వాహకురాలు వెంటనే చేరుకుని వృద్ధురాలికి వందేమాతరం టీమ్‌ సభ్యులతో కలిసి జుట్టు కత్తిరించి, స్నానం చేయించి ఆస్పత్రికి తరలించారు. తర్వాత విషయాన్ని తహసీల్దార్‌ శోభాసువర్ణమ్మకు తెలిపారు. స్పందించిన తహసీల్దార్‌ ఐసీడీఎస్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

Updated Date - Mar 29 , 2024 | 12:46 AM

Advertising
Advertising