రిటైర్డ్ బీఎస్‌ఎఫ్ జవాను ఇంట్లో డిఫెన్స లిక్కర్
ABN, Publish Date - Mar 26 , 2024 | 12:44 AM
అనంతపురం నగరంలో రిటైర్డ్ బీఎస్‌ఎఫ్ జవాను ఇంట్లో డిఫెన్స లిక్కర్ పట్టుబడింది. రూ.5.50 లక్షల విలువైన 303 డిఫెన్స లిక్కర్ బాటిళ్లను సెబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతపురం క్రైం, మార్చి 25: అనంతపురం నగరంలో రిటైర్డ్ బీఎస్‌ఎఫ్ జవాను ఇంట్లో డిఫెన్స లిక్కర్ పట్టుబడింది. రూ.5.50 లక్షల విలువైన 303 డిఫెన్స లిక్కర్ బాటిళ్లను సెబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నార్పల మండలం తుంపెర గ్రామానికి చెందిన రిటైర్డ్ బీఎస్‌ఎఫ్ జవాను ఎన.హనుమంతరెడ్డి, అనంతపురం నగర శివారులోని శిల్పా లేపాక్షి నగర్‌లో ఉంటున్నారు. బెంగుళూరులోని ఆర్మీ క్యాంటీనలో తను, తన సహచర రిటైర్డ్ జవాన్ల ద్వారా కొనుగోలు చేసిన లిక్కర్ బాటిళ్లను అనంతపురానికి తీసుకువచ్చి అధికఽ దరలకు విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న సెబ్ అదనపు ఎస్పీ రామకృష్ణ ఆదివారం రాత్రి తన సిబ్బందితో కలిసి హనుంతరెడ్డి ఇంటిపై దాడులు నిర్వహించారు. మధ్యవర్తుల సమక్షంలో అక్రమంగా నిల్వ చేసిన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేశామని సెబ్ ఏఎస్పీ తెలిపారు.
Updated Date - Mar 26 , 2024 | 12:44 AM