ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వైసీపీకి ఓటమి ఖాయం: సవిత

ABN, Publish Date - Mar 29 , 2024 | 12:21 AM

సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని టీడీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. పెను కొండ పట్టణంలోని షిర్డీ సాయి బాబా వీధిలో ఆమె గురువారం ఎన్నికల ప్రచా రం నిర్వహించారు.

ఇంటింటి ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత

పెనుకొండ టౌన, మార్చి 28: సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని టీడీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. పెను కొండ పట్టణంలోని షిర్డీ సాయి బాబా వీధిలో ఆమె గురువారం ఎన్నికల ప్రచా రం నిర్వహించారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ... దాదాపు 80 శాతం హామీలను ఎగ్గొటినందుకు జగన పార్టీ ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. మద్య నిషేధం హామీపై మడమ తిప్పాడని, నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడాడరన్నారు. విద్యుత చార్జీలు తొమ్మిది సార్లు పెంచడమే కాకుం డా కరెంటు కోతలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెట్టారన్నారు. స్మార్టు మీట ర్లు, వ్యవసాయ మీటర్ల కొనుగోలులో వేల కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా చేశారన్నారు. ఏది ఏమైనా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇనచార్జ్‌ ఆవుల నరేంద్ర, నాయకులు శ్రీరాములు, కోనాపురం రామలింగ, రఘు వీర చౌదరి, సుబ్రహ్మణ్యం, మాధవనాయుడు, బాబుల్‌రెడ్డి, మైనార్టీ నాయకుడు దాదు, షమీన, చంద్రకాంతమ్మ, రమణమ్మ తదితరలు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2024 | 12:21 AM

Advertising
Advertising