క్రికెట్ బ్యాట్లు సీజ్
ABN, Publish Date - Mar 21 , 2024 | 11:55 PM
సరైన పత్రాలు లేని కారణంగా బెంగ ళూరు నుంచి ఉత్తర ప్రదేశకు తీసుకెళు తున్న వంద క్రికెట్ బ్యాట్లను పోలీసులు సీజ్ చేసినట్లు ఎస్ ఐ గంగాధర్ గురు వారం తెలిపారు.
చిలమత్తూరు, మార్చి 21: సరైన పత్రాలు లేని కారణంగా బెంగ ళూరు నుంచి ఉత్తర ప్రదేశకు తీసుకెళు తున్న వంద క్రికెట్ బ్యాట్లను పోలీసులు సీజ్ చేసినట్లు ఎస్ ఐ గంగాధర్ గురు వారం తెలిపారు. ఉత్తరప్రదేశకి చెందినన అకాష్ సింగ్ తన వాహనంలో వంద క్రికెట్ బ్యాట్లను తీసుకెళుతుండగా కొడికొండ చెక్‌పోస్టులో చేపడుతున్న పోలీసుల తనిఖీలో పట్టుబడ్డాయన్నారు. సంబంధిత క్రికెట్ బ్యాట్లకు సరైన పత్రాలు అతడి వద్ద లేకపోవడంతో వాటిని సీజ్ చేశామన్నారు. నాగపూర్‌లో జరుగుతున్న ఓ క్రికెట్ టోర్నమెంట్ కోసం ఈ బ్యాట్లు తీసుకెళుతున్నట్లు ఆకాష్ సింగ్ తెలిపాడన్నారు. స్వాధీనం చేసుకున్న బ్యాట్లతోపాటు వాహనాన్ని హిందూపురం ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్దకు పంపామని ఎస్‌ఐ తెలిపారు.
Updated Date - Mar 21 , 2024 | 11:55 PM