ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ముగ్గురిపై వేటు

ABN, Publish Date - Jan 29 , 2024 | 11:30 PM

ఓటర్ల తుది జాబితా రూపకల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు బీఎల్వోలను కలెక్టర్‌ గౌతమి సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లావ్యాప్తంగా ఓటర్ల తుది జాబితాలో మృతుల పేర్లు, డబుల్‌, ట్రిపుల్‌ ఎంట్రీలపై ఆంధ్రజ్యోతి వరుస కథనాలను ప్రచురిస్తోంది. ముసాయిదా జాబితాలో వచ్చిన తప్పులే తుది జాబితాలోనూ ఉన్నాయి. దీంతో కలెక్టర్‌ సీరియ్‌సగా స్పందించారు. తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి 83వ పోలింగ్‌ కేంద్రం బీఎల్వో ఆదిలక్ష్మి(వీఆర్‌ఏ), 84వ పోలింగ్‌ కేంద్రం బీఎల్వో క్రిష్ణాంజలి (సచివాలయ మహిళా పోలీస్‌), యాడికి మండలం ఓబుళాపురం 91వ పోలింగ్‌ కేంద్రం, కోన ఉప్పలపాడు 92వ పోలింగ్‌ కేంద్రం బీఎల్వో గౌతమ బుద్ధుడు (వీఆర్‌ఓ)ను కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు.

మిగిలినవారిలో గుబుబు..

ఓటరు జాబితా తప్పుల పర్యవసానం

అనంతపురం టౌన/యాడికి, జనవరి 29: ఓటర్ల తుది జాబితా రూపకల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు బీఎల్వోలను కలెక్టర్‌ గౌతమి సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లావ్యాప్తంగా ఓటర్ల తుది జాబితాలో మృతుల పేర్లు, డబుల్‌, ట్రిపుల్‌ ఎంట్రీలపై ఆంధ్రజ్యోతి వరుస కథనాలను ప్రచురిస్తోంది. ముసాయిదా జాబితాలో వచ్చిన తప్పులే తుది జాబితాలోనూ ఉన్నాయి. దీంతో కలెక్టర్‌ సీరియ్‌సగా స్పందించారు. తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి 83వ పోలింగ్‌ కేంద్రం బీఎల్వో ఆదిలక్ష్మి(వీఆర్‌ఏ), 84వ పోలింగ్‌ కేంద్రం బీఎల్వో క్రిష్ణాంజలి (సచివాలయ మహిళా పోలీస్‌), యాడికి మండలం ఓబుళాపురం 91వ పోలింగ్‌ కేంద్రం, కోన ఉప్పలపాడు 92వ పోలింగ్‌ కేంద్రం బీఎల్వో గౌతమ బుద్ధుడు (వీఆర్‌ఓ)ను కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. అనంతపురం అర్బన, రాప్తాడు నియోజకవర్గాలలో అక్రమాలపైనా కలెక్టర్‌ స్పందించారు. పత్రికలలో వచ్చిన కథనాలపై పూర్తిస్థాయి విచారించి నివేదికలు పంపాలని ఆయా నియోజకవర్గాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. నివేదిక ఆధారంగా మరికొందరు బీఎల్వోలపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారవర్గాలు అంటున్నాయి. జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఓటర్ల తుదిజాబితా తప్పుల తడకగానే ఉంది. కలెక్టర్‌ చర్యలతో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అధికారులు, సిబ్బందిలో గుబులు మొదలైంది.

Updated Date - Jan 29 , 2024 | 11:30 PM

Advertising
Advertising