old students పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ABN, Publish Date - Dec 16 , 2024 | 01:32 AM
పట్టణంలోని కరణం చిక్కప్ప ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. పాఠశాలలో 1995-96వ విద్యాసంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు మళ్లీ 28 ఏళ్ల తర్వాత అదే పాఠశాలలో కలుసుకున్నారు.
కళ్యాణదుర్గం, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని కరణం చిక్కప్ప ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. పాఠశాలలో 1995-96వ విద్యాసంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు మళ్లీ 28 ఏళ్ల తర్వాత అదే పాఠశాలలో కలుసుకున్నారు.
ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులు నాగభూషణ, రవీంద్రబాబు, మల్లారెడ్డి, లక్ష్మీనారాయణ, శంకరన్న, హేమాద్రి, నాగరాజు, జీపీ నారాయణను పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. సాయంత్రం వరకు అందరూ పాఠశాలలో ఆనందంగా గడిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...
Updated Date - Dec 16 , 2024 | 01:32 AM