పూర్వవిద్యార్థుల సమ్మేళనం
ABN, Publish Date - Jan 29 , 2024 | 12:10 AM
పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల, సరస్వతి విద్యామందిరంలో పదోతరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం వేర్వే రుగా సమావేశమై వారి తీసి జ్ఞాపకాలను పంచుకున్నారు.
గోరంట్ల, జనవరి 28: పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల, సరస్వతి విద్యామందిరంలో పదోతరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం వేర్వే రుగా సమావేశమై వారి తీసి జ్ఞాపకాలను పంచుకున్నారు. బాలుర ఉన్నత పా ఠశాలలో 1980-81లో పదో తర గతి చదవిన పూర్వ విద్యార్థులు ముందుగా గోరంట్లలో ప్రధాన రహదారిపై ప్రదర్శనగా తాము చదువుకున్న పాఠశాల వద్దకు వెళ్లారు. తాము చదువుకున్న రోజుల్లో మధుర స్మృతులను ముచ్చటిం చుకున్నారు. అనంతరం పట్టణంలోని వాసవి మహల్‌లో సమావేశమై తమకు చదువు చెప్పిన అప్పటి ఉపాధ్యాయులు రఘురామిరెడ్డి, శంకర్ నారాయణ, ఓబిరెడ్డి, సుబ్రహ్మణ్యం, కుళ్లాయప్పను శాలువలు, పూలమాలు, నూతన వస్ర్తాలతో సత్కరించారు. అలాగే పట్టణంలోని సరస్వతి విద్యామందిరంలో 2010-11లో పదోతరగతి చదివిన పూర్వవిద్యార్థులు ఆ పాఠశాలలలో సమావేశమయ్యారు. ఒకరినొకరు పలుకరించుకుని, గత స్మృతులను నెమరు వేసుకున్నారు. తమకు చదువు చెప్పిన ప్రధానోపాధ్యాయుడు నరసింహులుతో పాటు మొత్తం 22మంది ఉపాధ్యాయులను సన్మానించారు.
పెనుకొండ: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన 1993-95బ్యాచ ఇంటర్ పూర్వ విద్యార్థులు 30ఏళ్ల తర్వాత ఒకేచోట కలిసి గత స్మృతులను నెమరువేసుకున్నారు. స్థానిక జూ నియర్ కళాశాలలో ఆదివారం ఇంటర్ పూర్వ విద్యార్థులు హైకోర్టు న్యాయవాది శివరామక్రిష్ణ, మాధవి, కళాభారతి ఆధ్వర్యంలో 40 మంది ఒకేచోట కలిశారు. అప్పటి తీపి గుర్తులను తలుచుకుంటూ ఆనందంగా గడిపారు. అనంతరం త మకు చదువు చెప్పిన లెక్చరర్ శ్రీరాములు కుమారుడు ప్రస్తుత లెక్చరర్ మూర్తిని ఘనంగా సత్కరించారు. తాము చదువుకున్న కళాశాలకు తమ వంతుగా ఏదైనా చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు వారు తెలిపారు.
Updated Date - Jan 29 , 2024 | 12:10 AM