ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పాఠశాల విద్య ప్రక్షాళన

ABN, Publish Date - Nov 07 , 2024 | 04:24 AM

ఎట్టకేలకు ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖను ప్రక్షాళన చేసింది. అదనపు డైరెక్టర్లు, జాయింట్‌ డైరెక్టర్లు, డిప్యూటీ డైరె క్టర్లను భారీగా బదిలీ చేసింది.

భారీగా ఏడీ, జేడీ, డీడీలు బదిలీ

ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌గా ఎంవీ కృష్ణారెడ్డి

పరీక్షల విభాగం డైరెక్టర్‌గా శ్రీనివాసులురెడ్డి

పాఠ్యపుస్తకాల డైరెక్టర్‌గా మధుసూదనరావు

ప్రతాప్‌రెడ్డికి అప్రాధాన్య పోస్టు

అమరావతి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖను ప్రక్షాళన చేసింది. అదనపు డైరెక్టర్లు, జాయింట్‌ డైరెక్టర్లు, డిప్యూటీ డైరె క్టర్లను భారీగా బదిలీ చేసింది. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీతో అంటకాగినట్లు ఆరోపణలున్న ఎస్‌ సీఈఆర్‌టీ డైరెక్టర్‌ను బదిలీ చేసి వయోజన విద్య జేడీగా నియమించింది. ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ బాధ్యతలను జేడీ ఎంవీ కృష్ణారెడ్డికి అప్పగించింది. కేజీబీవీ కార్యదర్శి డి.మధుసూదనరావును బదిలీ చేసి పాఠ్యపుస్తకాల విభాగం డైరెక్టర్‌గా నియమించింది. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డిని బదిలీ చేసి కేజీబీవీ కార్యదర్శిగా నియమించింది. అదనపు ఎస్పీడీ-1 కేవీ శ్రీనివాసులురెడ్డిని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌గా, అదనపు డైరెక్టర్‌ ఎ.సుబ్బారెడ్డిని టెట్‌ జేడీగా నియమించింది. ఆయన కు టీచర్ల సర్వీసు అంశాలు కూడా అప్పగించింది. గురుకుల విద్యాలయాల అదనపు డైరెక్టర్‌ ఆర్‌.నరసింహారావును ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ అదనపు డైరెక్టర్‌గా బదిలీ చేసింది. గత ప్రభుత్వంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న జేడీ వై.రాఘవరెడ్డిని జవహర్‌ బాల భవన్‌ డీడీ పోస్టుకు పంపింది.

Updated Date - Nov 07 , 2024 | 04:24 AM