ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కర్నూలు యార్డులో ఉల్లి లోడింగ్‌కు చర్యలు

ABN, Publish Date - Oct 27 , 2024 | 03:30 AM

ఈ-నామ్‌’లో తలెత్తిన సాంకేతిక సమస్యలను పరిష్కరించి, మార్కెట్‌ యార్డుల్లో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను శనివారం ఆదేశించారు.

అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం

అమరావతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ‘ఈ-నామ్‌’లో తలెత్తిన సాంకేతిక సమస్యలను పరిష్కరించి, మార్కెట్‌ యార్డుల్లో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను శనివారం ఆదేశించారు. కర్నూలు యార్డులో ఉల్లి పంటను తెచ్చిన రైతులకు.. ఈ-నామ్‌లో సాంకేతిక సమస్యతో టెండరు ప్రక్రియలో జాప్యం జరిగి, కాటాలు, లోడింగ్‌కు ఎక్కువ సమయం పడుతోందన్న విషయం మంత్రి దృష్టికి వచ్చింది. దీనిపై స్పందించిన మంత్రి.. కర్నూలు యార్డులో ఉల్లి లోడింగ్‌కు ఎక్కువ వాహనాలు ఏర్పాటు చేయాలని, రైతులకు అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - Oct 27 , 2024 | 03:30 AM