ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వైసీపీ నేతల అధికార మదానికి నిదర్శనం

ABN, Publish Date - Mar 27 , 2024 | 02:26 AM

కాకినాడలో అర్చకులపై వైసీపీ నేత దాడి ఆ పార్టీ నేతల అధికార మదానికి నిదర్శనమని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు.

అర్చకులపై దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు, లోకేశ్‌

అమరావతి(ఆంధ్రజ్యోతి), మంగళగిరి, మార్చి 26: కాకినాడలో అర్చకులపై వైసీపీ నేత దాడి ఆ పార్టీ నేతల అధికార మదానికి నిదర్శనమని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘అర్చకుడు అంటే దేముడికి, భక్తుడికి మధ్య అనుసంధానకర్తగా భావించి కాళ్లకు మొక్కే సంప్రదాయం మనది. అటువంటి పూజారులను భక్తుల సమక్షంలోనే కాలితో తన్నడం, కొట్టడం హేయమైన రాక్షస చర్య. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. నిందితుడిపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి’ అని ఆయన ‘ఎక్స్‌’లో డిమాండ్‌ చేశారు. కాగా, ఇదే అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఓ ప్రకటన చేస్తూ... వైసీపీ నేత చంద్రరావు గర్భగుడిలో స్వైరవిహారం చేసి పూజారులపై దాడికి పాల్పడడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. భగవంతుడికి సేవ చేయడం తప్ప మరో ధ్యాసలేని అర్చకులపైనా ప్రతాపం చూపడం సిగ్గుచేటని విమర్శించారు. కాగా, అర్చకులు, బ్రాహ్మణులపై వైసీపీ నేతలు దాడిచేస్తే సహించేది లేదని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్‌ సూర్య అన్నారు. హిందూ మతాన్ని నాశనం చేయాలని జగన్‌రెడ్డి కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు.

Updated Date - Mar 27 , 2024 | 09:02 AM

Advertising
Advertising