AP News: ఏపీలో 10 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
ABN, Publish Date - Mar 01 , 2024 | 08:03 PM
ఆంధ్రప్రదేశ్‌లో 10 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌గా కె.కన్నబాబును నియమించిన ప్రభుత్వం.. బుడితి రాజశేఖర్‌ను పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ నుంచి బదిలీ చేసింది. సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాలని రాజశేఖర్‌కు ఆదేశాలు జారీ చేసింది. పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్ ఎండీ, టూరిజం సీఈవోగా కన్నబాబుకు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 10 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌గా కె.కన్నబాబును నియమించిన ప్రభుత్వం.. బుడితి రాజశేఖర్‌ను పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ నుంచి బదిలీ చేసింది. సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాలని రాజశేఖర్‌కు ఆదేశాలు జారీ చేసింది. పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్ ఎండీ, టూరిజం సీఈవోగా కన్నబాబుకు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఇక జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. పంచాయితీరాజ్ ముఖ్యకార్యదర్శిగా శశిభూషణ్ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. మత్య్సశాఖ కమిషనర్‌గా ఏ.సూర్యకుమారి, కె.హర్షవర్థన్‌కు మైనారిటీ సంక్షేమశాఖ అదనపు బాధ్యతలు, సెర్ప్ సీఈఓగా మురళీధర్‌రెడ్డికి అదనపు బాధ్యతలు, సీసీఎల్ఏ కార్యదర్శిగా వెంకటరమణారెడ్డికి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.
Updated Date - Mar 01 , 2024 | 08:04 PM