విప్రో ఉద్యోగులకు షాకింగ్ న్యూస్..
ABN, First Publish Date - 2023-11-08T09:51:55+05:30
హైదరాబాద్: కరోన మహమ్మారి కారణంగా పలు ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. మహమ్మారి వ్యాప్తి పూర్తిగా అదుపులోకి రావడంతో కొన్ని సంస్థలు హైబ్రేడ్ పద్ధతిని అవలంభిస్తున్నాయి.
హైదరాబాద్: కరోన మహమ్మారి కారణంగా పలు ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. మహమ్మారి వ్యాప్తి పూర్తిగా అదుపులోకి రావడంతో కొన్ని సంస్థలు హైబ్రేడ్ పద్ధతిని అవలంభిస్తున్నాయి. వారానికి కనీసం రెండు మూడు రోజులైనా కార్యాలయాలకు వచ్చి పనిచేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు ఇప్పటికే ఉద్యోగులను కార్యాలయానికి వచ్చి పనిచేయాలని సూచించాయి. ఇప్పుడు విప్రో కూడా తమ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. వర్క్ ఫ్రం హోం పద్ధతికి స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడిస్తూ ఇకపై ఉద్యోగులు వారానికి మూడు రోజులు తప్పనిసరిగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-11-08T09:51:56+05:30 IST