ఇన్ఫోసిస్ ఉద్యోగులకు పండగ..
ABN, First Publish Date - 2023-11-23T11:04:35+05:30
దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం తీసుకుంది. క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ బోనస్‌పై ఇప్పుడు కీలక ప్రకటన చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించి అర్హులైన ఉద్యోగులకు 80 శాతం వేరియబుల్ పే చెల్లించనున్నట్లు పేర్కొంది.
ABN Digital: దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం తీసుకుంది. క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ బోనస్‌పై ఇప్పుడు కీలక ప్రకటన చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించి అర్హులైన ఉద్యోగులకు 80 శాతం వేరియబుల్ పే చెల్లించనున్నట్లు పేర్కొంది. ఈ నవంబర్ నెల జీతంతోపాటు వారి అకౌంట్లలో డబ్బులు పడతాయని స్పష్టం చేసింది. పోజిషన్ లెవెల్-6 కంటే దిగువన ఉన్న ఉద్యోగులు సగటున 80 శాతం వేరియబుల్ పే అందుకునేందుకు అర్హులని వెల్లడించింది. పీఎల్-6 అంటే మేనేజర్ స్థాయి ఉద్యోగులు అన్న మాట. వీరితో పాటు ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు వేరియబుల్ పే అందదని అర్థం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-11-23T11:04:38+05:30 IST