మళ్లీ జగన్ సీఎం అయితే..: బాలకోటయ్య
ABN, First Publish Date - 2023-10-30T11:20:08+05:30
అమరావతి: అమరావతిని నాశనం చేయాలని సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని, ఇప్పటికే నాశనం చేశారని అమరాతి బహుజన జేఏసీ నేత పోతుల బాలకోటయ్య అన్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితే..
అమరావతి: అమరావతిని నాశనం చేయాలని సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని, ఇప్పటికే నాశనం చేశారని అమరాతి బహుజన జేఏసీ నేత పోతుల బాలకోటయ్య అన్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితే.. రెండోసారి ప్రజలు ఛాన్స్ ఇస్తే.. రోడ్డు మీద వెళుతున్న ఆడవాళ్లను కూడా ఎత్తుకుపోతారని అన్నారు. హారన్ కొడితే ఆర్టీసీ డ్రైవర్‌ను కొడతారా? అని ప్రశ్నించారు. దీనిబట్టి చూస్తే జగన్ పరిపాలన ఎలా ఉందో అర్థమవుతోందన్నారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే హరితాంధ్ర.. స్వర్ణాంధ్ర.. మొన్నటి వరకు ‘ఏ’ అంటే అమరావతి; ‘పీ’ అంటే పోలవరం అని.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాలంటే సిగ్గుతో తలదించుకుంటున్నామని అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-10-30T11:20:08+05:30 IST