మునుగోడులో రాజకీయ వేడి..
ABN, First Publish Date - 2023-11-03T07:58:38+05:30
నల్గొండ జిల్లా: మునుగోడు నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. ఇక్కడ త్రిముఖ పోటీ జరుగుతోంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో 2022లో ఉపఎన్నిక జరిగింది.
నల్గొండ జిల్లా: మునుగోడు నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. ఇక్కడ త్రిముఖ పోటీ జరుగుతోంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో 2022లో ఉపఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన రాజగోపాల్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరి టిక్కెట్ తెచ్చుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి భంగపడిన చలమల్ల కృష్ణారెడ్డి బీజేపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. అధికార బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర రెడ్డి పోటీ చేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-11-03T08:08:20+05:30 IST