ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వామ్మో.. చలి!

ABN, Publish Date - Dec 23 , 2023 | 11:51 PM

ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. తీవ్ర చలికి ఉమ్మడి జిల్లా ప్రజలు గజగజ వణుకుతున్నారు. పగటిపూట సాధారణ ఊష్ణోగ్రతలు నమోదవుతున్నా.. రాత్రి వేళల్లో కనిష్టంగా నమోదవుతున్నాయి.

పడిపోయిన ఉష్ణోగ్రతలు, పెరిగిన చలి తీవ్రత

రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో 8.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

రంగారెడ్డి అర్బన్‌, డిసెంబర్‌ 23 : ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. తీవ్ర చలికి ఉమ్మడి జిల్లా ప్రజలు గజగజ వణుకుతున్నారు. పగటిపూట సాధారణ ఊష్ణోగ్రతలు నమోదవుతున్నా.. రాత్రి వేళల్లో కనిష్టంగా నమోదవుతున్నాయి. వారం రోజులుగా వాతావర ణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం 9 గంటలైనా భానుడి దర్శనం ఉండడం లేదు. సాయంత్రం 5 గంటల నుంచే చల్లగాలులు వణికిస్తున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఈ సమయంలో గాలిలో వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉంటుందని, రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు త్వరగా వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

తాళ్లపల్లిలో 8.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు

రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దట్టమైన పొగమంచుతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శనివారం రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం తాళ్లపల్లిలో 8.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో 10.3 డిగ్రీలు నమోదు కాగా మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లి పరిధిలోని కేశవరంలో 11.1 డిగ్రీలు నమోదైంది.

అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన

ఆస్తమా, నిమోనియా, గుండె వ్యాధులతో బాధపడే వారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఏసీ గదుల్లో ఉన్నా ఆస్తమా సమస్య ఎక్కువవుతుంది. నిర్లక్ష్యం చేస్తే ఇన్‌ఫెక్షన్‌ అయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. పిల్లలో ముఖ్యంగా జలుబు, దగ్గును అశ్రద్ధ చేస్తే న్యూమోనియా సోకే ప్రమాదం ఉన్నది. శిశువులకు ఆరు నెలల వరకు తల్లిపాలు తాగిస్తే ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరదు.

ఈ జాగ్రత్తలు పాటించాలి

పొగమంచు బారిన పడకుండా మాస్కులు ధరించాలి. దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం ఉంటే ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకోవాలి. అవసరమైతే వైద్యుడిని సంప్రదించాలి. మధుమేహం, గుండె జబ్బులు ఉన్న వారు శరీరంపై గీతలు పడకుండా జాగ్రత్త పడాలి. శరీరం పొడిబారకుండా తడిగా ఉండేలా చూసుకోవాలి. గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి, బాగా వేడిగా ఉన్న నీళ్లు వాడకూడదు. వాహనాలు నడిపే వారు చేతులకు గ్లౌజులు ధరించాలి.

Updated Date - Dec 23 , 2023 | 11:51 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising