ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రాష్ట్రం ఇవ్వకుంటే కేసీఆర్‌ సీఎం అయ్యేవారా?

ABN, First Publish Date - 2023-10-30T03:03:47+05:30

‘‘మా అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యేవారా? తెలంగాణ ఏర్పాటు సమయంలో సోనియా కాళ్లు పట్టుకున్న కేసీఆర్‌ ఇప్పుడు దూషిస్తున్నారు.

నాడు సోనియా కాళ్లుపట్టుకొని.. నేడు దూషిస్తున్నారు

మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్‌ అప్పుల్లో ముంచారు..

తెలంగాణలో ప్రతి వ్యక్తిపై 1.25 లక్షల అప్పు

బీఆర్‌ఎస్‌ పాలనలో ఎవరికీ మేలు జరగలే..

కాళేశ్వరంలో కేసీఆర్‌ కుటుంబం వేల కోట్లు దోచుకుంది

మోదీ ఝూటా, దోఖాబాజీ..

ఆయనకు కేసీఆర్‌ బీ టీమ్‌..

కర్ణాటకలో గ్యారెంటీలు అమలు చేస్తున్నాం

తెలంగాణలోనూ గెలుస్తాం..

అమలు చేస్తాం.. సంగారెడ్డి, మెదక్‌ సభల్లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే

సంగారెడ్డి/మెదక్‌, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘‘మా అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యేవారా? తెలంగాణ ఏర్పాటు సమయంలో సోనియా కాళ్లు పట్టుకున్న కేసీఆర్‌ ఇప్పుడు దూషిస్తున్నారు. రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో రాష్ట్రం ఇస్తే రూ.5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు. తెలంగాణలో ప్రతి వ్యక్తిపై రూ.1.25 లక్షల భారం మోపారు’’ అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో నిరుద్యోగులు, మహిళలు, రైతులు ఎవరికీ మేలు జరగలేదని ఆరోపించారు. కానీ, కాళేశ్వరం పేరిట కేసీఆర్‌ కుటుంబం రూ.వేల కోట్లు దోచుకుందని ఆరోపించారు. ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ చేపట్టిన విజయభేరి బస్సు యాత్రలో భాగంగా ఆదివారం సంగారెడ్డి గంజ్‌ మైదాన్‌, మెదక్‌లోని రాందాస్‌ చౌరస్తాల్లో నిర్వహించిన సభలకు ఖర్గే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

తెలంగాణ ప్రజల కష్టాలను దూరం చేయడం కోసమే సోనియా ఆరు గ్యారంటీలను ప్రకటించారని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తుందని.. గ్యారెంటీలను వెంటనే అమలు చేసి తీరతామని స్పష్టం చేశారు. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలకుగాను ఇప్పటికే నాలుగు ఇచ్చామన్నారు. మిగిలిన ఒక్కదానినీ నవంబరు నుంచి అమలు చేస్తామని చెప్పారు. కాంగ్రె్‌సను భయపెట్టాలని ప్రధాని మోదీ, కేసీఆర్‌ చూస్తున్నారని, తాము భయపెడతామే తప్ప భయపడబోమని ఖర్గే వ్యాఖ్యానించారు. మోదీ ఏం చేసినా మద్దతిస్తూ కేసీఆర్‌ ఆయనకు బీ టీమ్‌గా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మోదీ మాటలన్నీ ఝూటాయేనని, నిరుద్యోగులు, ప్రజలను వంచించడమేనని దుయ్యబట్టారు. మెదక్‌ ఎంపీగా గెలిచిన ఇందిరాగాంధీ.. బీహెచ్‌ఈఎల్‌, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ, బీడీఎల్‌ పరిశ్రమలను స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పించారని పేర్కొన్నారు. మోదీ మాత్రం ఆ సంస్థలను అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

దీనికి కేసీఆర్‌ మద్దతు ఇస్తున్నారన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తానన్న మోదీ 9 ఏళ్లలో 2 వేల ఉద్యోగాలే ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. కేంద్రప్రభుత్వ శాఖల్లో ఖాళీ గా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం లేద ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సభల్లో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మెదక్‌, దుబ్బాక, నర్సాపూర్‌, మల్కాజిగిరి కాంగ్రెస్‌ అభ్యర్థులు మైనంపల్లి రోహిత్‌, శ్రీనివా్‌సరెడ్డి, రాజిరెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, సీనియర్‌ నేతలు శ్రీధర్‌బాబు, షబ్బీర్‌ అలీ, దామోద ర రాజనర్సింహా, వీహెచ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-30T03:03:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising