ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘ఇద్దరు బిడ్డల తండ్రిని అలా ఎందుకు చేస్తా?’

ABN, Publish Date - Dec 27 , 2023 | 04:05 AM

ఇద్దరు ఆడపిల్లల తండ్రినైన తాను మరో బాలిక పట్ల ఎలా అసభ్యంగా ప్రవర్తిస్తానని శ్రీలంక పోలీసుల అదుపులో ఉన్న తెలంగాణ ప్రవాసీయుడు వాపోయాడు.

శ్రీలంక జైలులో ఉన్న తెలంగాణ ప్రవాసీ ఆవేదన

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి) : ఇద్దరు ఆడపిల్లల తండ్రినైన తాను మరో బాలిక పట్ల ఎలా అసభ్యంగా ప్రవర్తిస్తానని శ్రీలంక పోలీసుల అదుపులో ఉన్న తెలంగాణ ప్రవాసీయుడు వాపోయాడు. ఆ బాలిక, ఆమె తల్లి పట్ల తనకు ఎలాంటి దురుద్దేశం లేదని తన భార్యకు వివరించాడు. విమానంలో ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో తెలంగాణలోని జగిత్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి(49)ని శ్రీలంక పోలీసులు పది రోజుల క్రితం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే, పోలీసుల అదుపులో ఉన్న ఆ వ్యక్తి తన భార్యతో ఫోన్‌లో మాట్లాడాడు. రియాధ్‌ నుంచి కొలంబో మీదుగా హైదరాబాద్‌కు వస్తుండగా తనని అరెస్టు చేశారని తెలిపాడు. సదరు బాలిక తల్లి కోరిక మేరకే ఎయిర్‌లైన్స్‌కు చెందిన దుప్పటిని లగేజీ క్యాబిన్‌లో నుంచి తీసి ఆ చిన్నారికి కప్పానని చెప్పాడు. తన కుమార్తెల కంటే చిన్నపిల్ల పట్ల ఎలా తప్పుగా ప్రవర్తిస్తానని వివరణ ఇచ్చాడు. శ్రీలంక పోలీసులు నిర్వహించిన వైద్య పరీక్షల్లో తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని, తోటి ప్రయాణికులు కూడా వాస్తవాలను పోలీసులకు తెలియజేశారని చెప్పాడు. కాగా, శ్రీలంక పోలీసుల అదుపులో ఉన్న తెలంగాణ ప్రవాసీకి న్యాయ సాయం అందించే విషయంలో సౌదీ అరేబియాలోని సామాజిక కార్యకర్త అబ్దులు రఫీక్‌ శ్రీలంకలోని భారతీయ హైకమిషన్‌తోపాటు న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

Updated Date - Dec 27 , 2023 | 04:05 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising