నడిపించే నాయకుడెవరు?
ABN, Publish Date - Dec 17 , 2023 | 11:02 PM
మేడ్చల్ నియోజక వర్గంలోని కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. నిన్నటి వరకు అధికారం లేక ఇబ్బందుల పడ్డ పార్టీ క్యాడర్ ప్రస్తుతం అధికారంలోకి వచ్చినా సంతృప్తి చెందని పరిస్థితితులు కనబడుతున్నాయి.మేడ్చల్ నియోజక వర్గంలోని కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. నిన్నటి వరకు అధికారం లేక ఇబ్బందుల పడ్డ పార్టీ క్యాడర్ ప్రస్తుతం అధికారంలోకి వచ్చినా సంతృప్తి చెందని పరిస్థితితులు కనబడుతున్నాయి.
మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పగ్గాలు ఎవరికో?
ముందుండి నడిపే నేత కోసం ఎదురు చూపులు
మేడ్చల్ టౌన్, డిసెంబరు 17 : మేడ్చల్ నియోజక వర్గంలోని కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. నిన్నటి వరకు అధికారం లేక ఇబ్బందుల పడ్డ పార్టీ క్యాడర్ ప్రస్తుతం అధికారంలోకి వచ్చినా సంతృప్తి చెందని పరిస్థితితులు కనబడుతున్నాయి. ఎన్నికల ముందు పెద్ద నేతలందరు ముందుండి పార్టీ కార్యకలాపాలు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్ధి ఓడి పోవటంతో పెద్ద నేతలు ఎవ్వరు కనబడకుండా పోయారంటూ కార్యకర్తలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల అనంతరం బడా నేతలెవ్వరూ కింది స్థాయి క్యాడర్‌తో సమావేశం నిర్వహించక పోవటంతో పార్టీ కార్యకర్తలు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఫలితంగా తమ గురించి పట్టుకునే నేత ఎవరంటూ? కింది స్థాయి కేడర్ ప్రశ్నిస్తుంది.మేడ్చల్ నియోజకవర్గంలో అంతంత మాత్రాంగానే ఉన్న కాంగ్రెస్ పార్టీలో మార్పు చోటు చేసుకుంది. తొమ్మిదేళ్లుగా పార్టీ అధికారంలో లేక పోవటంతో పార్టీ కింది స్థాయి నాయకులు చాలా వరకు బీఆర్‌ఎ్‌సలో చేరారు. అయినప్పటికీ ఉన్న కొద్దిమంది నేతలు పార్టీ క్యాడర్‌ను కాపాడకుంటూ వచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టటంతో స్థానిక క్యాడర్‌లో ఒక కొత్త ఉత్సాహం చోటు చేసుకుంది. దీర్గ కాలం తరువాత మంచి రోజులు వచ్చాయని కాంగ్రెస్ నేతలు భావిస్తునపపటికీ ముందుండి పార్టీని నడిపే నేత ఎవరన్నది తెలియక పోవటంతో కింది స్థాయి నాయకులు కార్యకర్తలు నిరుత్సాహానికి గురవుతున్నారు
ఆ ఇద్దరికే పార్టీ పగ్గాలు?
ప్రస్తుతం మేడ్చల్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున బడా నేతలుగా భావిస్తున్న వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి పేర్లు వినబడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ఇద్దరు నేతలు పార్టీని ముందుకు తీసుకు పోయే బాధ్యతలు చేపడితే క్యాడర్‌లో మరింత ఉత్సాహం వస్తుందని, ఎమ్మెల్యే లేని లోటు తీరుతుందని పలువురు నాయకులు భావిస్తున్నారు. అదే విధంగా జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, నక్క ప్రభాకర్ ఉన్నప్పటికీ పార్టీ కేడర్ మాత్రం వజ్రేష్ యాదవ్, సుధీర్ రెడ్డి పట్ల ఉత్సాహం కనపరుస్తున్నారు. టికెట్ రాకపోవటంతో హరివర్ధన్‌రెడ్డి అసంతృప్తితో ఎన్నికల్లో నియోజక వర్గానికి దూరంగా ఉన్న విషయం అందరికి తెలిసిందే. బుజ్జగింపులో భాగంగా హరివర్ధన్ రెడ్డికి అధిష్టానం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోటీ చేసిన కామారెడ్డి నియోజక వర్గంలో ప్రచారానికి పంపారు. ఫలితంగా హరివర్ధన్ ఎన్నికల్లో మేడ్చల్ నియోజక వర్గానికి దూరంగాఉండాల్సి వచ్చింది. దీంతో స్థానిక కాంగ్రెస్ నేతలు వజ్రేష్ యాదవ్, సుధీర్‌రెడ్డి ఇద్దరిలో ఎవరో ఒకరు పార్టీ పగ్గాలు చేపట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే నియోజక వర్గంలోని నాయకులకు, కార్యకర్తలకు పని పడితే సుధీర్‌రెడ్డి లేదా వజ్రేష్ యాదవ్‌లను సంప్రదించి సమస్యలను పరిష్కరించుకుంటున్నట్లు ప్రచారం కొనసాగుతోంది. ఎన్నికల ముందు చాలా మంది బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిలో చాలా మంది ప్రజా ప్రతినిధులు ఉన్నారు. వీరందరు మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో పార్టీలో చేరిన వారు ఉండటం గమనార్హం.
Updated Date - Dec 17 , 2023 | 11:02 PM