Kumaram Bheem Asifabad:కొత్త రేషన్‌కార్డులు ఎప్పుడు?
ABN, Publish Date - Dec 14 , 2023 | 10:18 PM
రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలు రేషన్‌కార్డుల కోసం నిరీక్షిస్తున్నారు. ఆహారభద్రత కార్డులు పొందేందుకు అర్హత ఉన్న ప్రజలు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. 2021 జూన్‌లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతో ప్రక్రియ ప్రారంభం కాగా అర్హత గల వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
- ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్న పేదలు
- జిల్లాలో 12,570 దరఖాస్తులు
చింతలమానేపల్లి, డిసెంబరు 14: రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలు రేషన్‌కార్డుల కోసం నిరీక్షిస్తున్నారు. ఆహారభద్రత కార్డులు పొందేందుకు అర్హత ఉన్న ప్రజలు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. 2021 జూన్‌లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతో ప్రక్రియ ప్రారంభం కాగా అర్హత గల వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కొంత మందికి ఆహార భద్రత కార్డులు మంజూరు చేసినా అర్హులైన వారికి చాలా మందికి అందలేదు. కొత్త కార్డుల ప్రక్రియ చేపట్టపోవ డంతో దరఖాస్తులు కుప్పలు తెప్ప లుగా పడి ఉన్నాయి. ఏళ్లు గడిచినా రేషన్ కార్డుల ఊసే లేకపోవడంతో దరఖాస్తుదారులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ మైనాకార్డులు అందించేం దుకు చర్యలు తీసుకుంటుందని వేచి చూస్తున్నారు.
పథకాలకు దూరం..
కార్డుల్లో పేర్లు లేక పోవడంతో చాలా మంది ప్రభుత్వ పథకాలకు దూరం అవుతున్నారు. ఏళ్ల తరబడి రేషన్ సరుకులు కోల్పోవడంతో పాటు ఆరోగ్యశ్రీ పథకం వర్తించడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న ప్రజల్లో ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కు మార్‌రెడ్డి సివిల్ సప్లయి అధికా రులతో నిర్వహించిన సమీక్షలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగా నే రేషన్‌కార్డుల ప్రస్తావన తేవడంతో ఏళ్లుగా వేచి చూస్తున్న పేదలు తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నారు. ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తే జిల్లాలోని పేద ప్రజలకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది.
15 మండలాల పరిధిలో..
జిల్లాలోని 15 మండలాల పరిఽధిలో మొత్తం 1,40,024 రేషన్ కార్డులు ఉండగా, అర్హులైన వారు 12,570 మంది రేషన్‌కార్డుల మంజూరు కోసం దరఖాస్తులు చేసుకున్నారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. కాగా రేషన్‌కార్డులు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలకు పేదలు దూరమవుతున్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టే ప్రతీ పథకంలో రేషన్‌కార్డు ప్రామాణికంగా తీసుకుంటుండంతో నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారు. రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, తదితర పథకాలు రేషన్ కార్డులు లేక పోవడంతో నష్టపోతున్నారు. పెళ్లిళ్లు చేసుకున్న అమ్మాయిలు అత్తగారింట తన భర్తతో, పిల్లలతో కలిసి రేషన్ కార్డులు లేక పోవడంతో గ్రామాల్లో పేదలు నష్టపోతున్నారు. అలాగే మృతుల పేర్లు తొలగించడం, కొత్త పేర్లు చేర్చడం, తద్వారా అ ర్హులైన వారికి రేషన్‌కార్డులు అందజేయాలన్న డిమాండ్ ప్రజల్లో ఉంది.
ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి..
- రంగన్న చౌదరి, కర్జెల్లి
కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు రేషన్‌కార్డులు అం దజేసే ప్రక్రియ వెంటనే ప్రారంభించాలి. రేషన్‌కార్డులు లేక చాలా మం ది అవస్థలు పడుతున్నారు. రేషన్ కార్డులు అందజేస్తే నిరుపేదలకు అన్ని ప్రభుత్వ పథకాలు అందే అవకాశం ఉంది. ప్రభుత్వం రేషన్‌కా ర్డుల జారీకి చర్యలు తీసుకోవాలి.
Updated Date - Dec 14 , 2023 | 10:18 PM