ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Election campaign : ఏవి నాయకా.. నాటి పోస్టర్లు!

ABN, First Publish Date - 2023-11-21T03:30:15+05:30

ఎన్నికల ప్రచారమంటే ఒకప్పుడు.. గోడలన్నీ వివిధ పార్టీల నినాదాలతో, పోస్టర్లతో నిండిపోయేవి! ఏ వీధి చూసినా.. ఏ గోడ మీదైనా.. మార్కెట్లు, బస్టాపులు.. ఎక్కడ తిరిగినా.. ‘మా పార్టీకే

ఒకప్పుడు ఎన్నికల ప్రచారంలో కీలకం

ఇప్పుడు ప్రచారమంతా డిజిటల్‌గానే

ఎన్నికల ప్రచారమంటే ఒకప్పుడు.. గోడలన్నీ వివిధ పార్టీల నినాదాలతో, పోస్టర్లతో నిండిపోయేవి! ఏ వీధి చూసినా.. ఏ గోడ మీదైనా.. మార్కెట్లు, బస్టాపులు.. ఎక్కడ తిరిగినా.. ‘మా పార్టీకే ఓటేయండి’ అంటూ సర్వం వాల్‌ పోస్టర్ల మయంగా ఉండేది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులంతా వాల్‌ పోస్టర్లనే విస్తృత ప్రచారానికి ఎంచుకునేవారు. ఒకరి పోస్టర్ల మీద మరొక పార్టీ అభిమానులు పేడ వెయ్యడం.. చించెయ్యడం.. దానివల్ల పరస్పర ఘర్షణలు.. పోలీస్‌ స్టేషన్‌ దాకా చేరే వివాదాలు.. ఒక రేంజ్‌లో ఉండేవి. కానీ.. ఆరోజులు గతించాయి. ఇప్పుడంతా డిజిటల్‌ యుగం. డిజిటల్‌ ప్రచారం. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చి.. నామినేషన్ల ప్రక్రియ పూర్తయి.. అభ్యర్థులెవరో తేలి, ప్రచారం ఊపందుకున్నా.. ఎక్కడా వాల్‌పోస్టర్ల ఊసే లేదు. జాడే కనిపించట్లేదు. అక్కడక్కడా అరుదుగా కొన్నిచోట్ల డోర్‌ స్టిక్కర్లు మాత్రం కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్నికల ప్రచారమంతా డిజిటల్‌గానే సాగుతోంది. అభ్యర్థులంతా ప్రధానంగా సోషల్‌ మీడియానే నమ్ముకుని.. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో పోస్టర్లు, స్టిక్కర్లు, కరపత్రాలను ముద్రించే ప్రింటింగ్‌ ప్రెస్‌లకు గిరాకీ తగ్గింది.

హైదరాబాద్‌ సిటీ, ఆంధ్రజ్యోతి

Updated Date - 2023-11-21T03:30:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising