ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్‌ కపట ప్రేమ

ABN, First Publish Date - 2023-11-10T23:41:25+05:30

ఆచరణకు నోచుకోని హామీలు ఇస్తూ.. కాంగ్రెస్‌ తెలంగాణ ప్రజల పై కపటప్రేమ కనబరుస్తున్నదని బీఆర్‌ఎస్‌ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి,పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. శుక్రవారంకొరిపెల్లి, వడ్డెకొత్తపల్లి, పోచారం, గంట్లకుంట, పోచంపల్లి, అవుతాపురం, ఉప్పరగూడెంలో ఆయన ఎన్నికల ప్రచా రం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు పెద్దఎత్తున బైకుర్యాలీ నిర్వహించి, ఎర్రబెల్లికి మంగళహారతులు, బతుకమ్మలతో స్వాగతం పలికారు.

వడ్డెకొత్తపల్లిలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు

పథకాలను కాపీకొట్టే ‘హస్తం’ పార్టీని తరిమికొట్టాలి

తెచ్చుకున్న రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత యువతదే

బీఆర్‌ఎస్‌ గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదు

బీఆర్‌ఎస్‌ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

పెద్దవంగర, నవంబర్‌ 10 : ఆచరణకు నోచుకోని హామీలు ఇస్తూ.. కాంగ్రెస్‌ తెలంగాణ ప్రజల పై కపటప్రేమ కనబరుస్తున్నదని బీఆర్‌ఎస్‌ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి,పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. శుక్రవారంకొరిపెల్లి, వడ్డెకొత్తపల్లి, పోచారం, గంట్లకుంట, పోచంపల్లి, అవుతాపురం, ఉప్పరగూడెంలో ఆయన ఎన్నికల ప్రచా రం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు పెద్దఎత్తున బైకుర్యాలీ నిర్వహించి, ఎర్రబెల్లికి మంగళహారతులు, బతుకమ్మలతో స్వాగతం పలికారు. ఆయా గ్రామంల్లో మంత్రి మాట్లాడుతూ మాట్లాడుతూ ఆరు హామీలతో కాంగ్రెస్‌ తెలంగాణలో ప్రచారం నిర్వహిస్తున్నదని, ఇక్కడ ఒకలా ఇతర రాష్ట్రాల్లో మరోలా హామీలున్నాయని, అసలు ఆ పార్టీ జాతీయ పార్టీనా.. రాష్ట్ర పార్టీనా చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ అబద్ధపు హామీలు ఇస్తూ.. అధికారం కోసం పాకులాడుతున్నదని అన్నారు. ప్రజలు ఆలోచించండి.. మోసం జేసిన కాంగ్రెస్‌ కావాల్నా? మేలు జేసిన బీఆర్‌ఎస్‌ కావాలా? తేల్చుకోండి అంటూ ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ సర్కారు పథకాలను కాపీకొట్టే కాం గ్రెస్‌ను గ్రామాల పాలిమేర్ల నుంచి తరిమికొట్టాలని ఆయన పిలుపు నిచ్చారు.

ఎన్నికలు అనగానే ఆగం కావొద్దు..

ఎన్నికలు అనగానే ఆగం కావద్దని, అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్‌ఎస్‌ విజయానికి కృషి చేయాలని మంత్రి దయాకర్‌ రావు పిలుపునిచ్చారు. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలను అవమానించిన కాంగ్రె్‌సను, దళితులను కాలుతో తన్నిన రేవంత్‌రెడ్డికి తలతన్నే విధంగా ఆ పార్టీని ఓడించి, అహంకారాన్ని అణిచివేద్దామని అన్నారు. ఇవాళ ఇక్కడ.. రేపు ఎక్క డో తెలియని వాళ్లకు ఓటు వేద్దామా? నిరంతరం మీ వెంటే ఉంటూ కష్టసుఖాలు పంచుకుంటూ ఉన్న తనకు ఓటు వేస్తారా ప్రజలు తేల్చుకోవాలన్నారు. పాలకుర్తి నియోజకవర్గ ప్రజల ఆశీస్సు లు ఉన్నంత వరకు బీఆర్‌ఎస్‌ గెలపును ఏ శక్తి అడ్డుకోలేదని మంత్రి ధీమా వ్యక్తంచేశారు. ఉద్యమాల పురిటిగడ్డ పాలకుర్తిలో ఎగిరేది గులాబీ జెండానేనని చెప్పారు. ఎన్నికలప్పుడే కాంగ్రెసోళ్లకు ప్రజలు గుర్తుకొస్తారని. ఎన్నికల తర్వాత పత్తాలేకుండా పోతారన్నారు.

కాంగ్రెస్‌ను కాలుపెట్టనివొద్దు..

రైతుల నడ్డి విరవడానికి 3 గంటల కరెంట్‌ సరిపోతుందంటున్న కాంగ్రెస్‌ కావాలా?.. లేదా 24 గంటల కరెంటు ఇస్తున్న బీఆర్‌ఎస్‌ కావాలా?...ప్రజలు తేల్చుకోవాలని, ప్రజల్ని విభజించి పాలించే కుట్రలు పన్నుతున్న కాంగ్రె్‌సను పాలకుర్తి నియోజకవర్గంలో కాలు పెట్టనివ్వవద్దని, వారిని తరిమికొట్టాలని ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. తెచ్చుకున్న తెలంగాణను కాపాడవల్సిన బాఽధ్య త యువతదేని అన్నారు. వడ్డెకొత్తపల్లిలో రాష్ట్ర మాజీ మంత్రి నెమురుగొమ్ముల యతిరాజారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో రేలారేరాలా ఫేమ్‌ గంగ, కనుకవ్వ, గిద్దె రాంనరస్సయ్య పాడిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

మంచి చేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి : తెలంగాణ వైద్య ఆరోగ్యశ్రీ ట్రస్టు చైర్మన్‌ సుధాకర్‌రావు

ప్రజలకు మంచిచేసే నాయకులను, ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశ్రీ ట్రస్టు చైర్మన్‌ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ నెమురుగొమ్ముల సుధాకర్‌రావు అన్నారు. నియోజకవర్గ ప్రజలను, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్‌ నాయకులు పలువురు మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్‌ఎ్‌సలో చేరారు. రాష్ట్ర నాయకులు కిషోర్‌రెడ్డి, ఎర్రంరెడ్డి తిరుపతిరెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, పాలకుర్తి దేవస్థాన చైర్మన్‌ రామచంద్రయ్యశర్మ, మాజీ మండల అధ్యక్షులు యాదగిరిరావు, పటేల్‌, రాజేందర్‌, భాస్కర్‌, ఎంపీటీసీలు శ్రీనివాస్‌, కల్పన, అనురాధ, సబిత విజయ, బీఆర్‌ఎస్‌ నాయకులు సోమేశ్వర్‌రావు, సోమనర్సింహారెడ్డి, ముత్తినేని శ్రీనివాస్‌, శ్రీరాం సంజయ్‌, శ్రీరాం సుధీర్‌, సోమారెడ్డి, సునిల్‌రెడ్డి, రాజుయాదవ్‌, సుధాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-11-10T23:41:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising