ముగిసిన నామినేషన్ల పర్వం
ABN, First Publish Date - 2023-11-10T23:59:23+05:30
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్ల స్వీకరణకు శుక్రవారం చివరి రోజు కావడంతో అధిక సంఖ్యలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. హనుమకొండ జిల్లాలోని రెండు నియోజకవర్గాల పరిధిలో వివిధ పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల స్వీకరణలో ఏకంగా 52 నామినేషన్లు దాఖలు అయ్యాయి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 24, పరకాల నియోజకవర్గంలో 28 చొప్పున నామినేషన్లు సమర్పించారు.
ఉమ్మడి జిల్లాలో పలువురు ప్రముఖుల దాఖలు
బీఆర్‌ఎస్ నుంచి వినయభాస్కర్, నరేందర్, బడే నాగజ్యోతి నామినేషన్
వరంగల్ పశ్చిమలో 55, పరకాలలో 61.. తూర్పులో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
హనుమకొండ రూరల్, నవంబరు 10: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్ల స్వీకరణకు శుక్రవారం చివరి రోజు కావడంతో అధిక సంఖ్యలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. హనుమకొండ జిల్లాలోని రెండు నియోజకవర్గాల పరిధిలో వివిధ పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల స్వీకరణలో ఏకంగా 52 నామినేషన్లు దాఖలు అయ్యాయి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 24, పరకాల నియోజకవర్గంలో 28 చొప్పున నామినేషన్లు సమర్పించారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్కర్ నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎల్.రమేశ్‌కు అందజేశారు. మాదారపు రవికుమార్ బీఎ్‌సపీ, ఐలాపురం వేణుచారి తెలంగాణ ద్రవిడ ప్రజల పార్టీ, గడ్డం నాగార్జున ఎంసీపీఐ (యూ) రెండో సెట్, సీతా రాజ్ కుమార్ బహుజన రిపబ్లికన్ సోషలిస్టు పార్టీ, ధర్మ సమాజ్ పార్టీ రూప మూడో సెట్, సీపీఐ ఎంఎల్ (లిబరేషన్) దామెర సుదర్శన్, విశ్వభారత్ పార్టీ సయ్యద్ నయీం, స్వతంత్ర అభ్యర్థులు గొల్లెన నరేందర్, గుర్రం శాంతమ్మ, గుర్రం జక్కయ్యలు రెండో సెట్ నామినేషన్లు సమర్పించారు. అలాగే మూరతోటి కల్పన, మహ్మద్ ఖలీలుద్దీన్, గుజ్జుల శ్రీనివా్‌సరెడ్డి, ఎర్ర అశోక్, కుందూరు కృష్ణ, బొమ్మగాని భార్గవ్, బొనగాని యాదగిరి, సయ్యద్ ఖాజా నయీమోద్దీన్, బి.విద్యాసాగర్‌లు నామినేషన్ పత్రాలు సమర్పించినట్లు వరంగల్ పశ్చిమ రిటర్నింగ్ అధికారి ఎల్.రమేశ్ వెల్లడించారు. మొత్తం 55 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు.
పరకాలలో 28..
పరకాల నియోజకవర్గంలో 28 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ తరపున డాక్టర్ పి.కాళీప్రసాద్, ఆయన భార్య పి.స్వర్ణలత నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ తరుపున ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సతీమణి చల్లా జ్యోతి, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తరపున పెండెల దేవరాజు, ఇండియన్ బిలివర్స్ పార్టీ తరపున బొచ్చు కృపాకర్, నవ భారత నిర్మాణ సేవా పార్టీ తరపున బండి శంకర్, నవ జన శాంతి కాంగ్రెస్ తరపున కలగాని సురేశ్, ధర్మ సమాజ్ పార్టీ నుంచి పురెల్ల రమేశ్ నామినేషన్ వేశారు.
బీఎ్‌సపీ నుంచి ఎ.మల్లేశంగౌడ్ రెండు సెట్లు, పాట పార్టీ నుంచి చిమ్మని దేవరాజు, సోషల్ వర్కర్ పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా శనిగరపు రమేశ్‌బాబు, అలియన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫామ్స్ పార్టీ నుంచి బోనగిరి యాదగిరి, భారతీయ స్వదేశ్ కాంగ్రెస్ పార్టీ నుంచి డి.శ్రావణ్ కుమార్ పరకాల నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివా్‌సకు తమ నామినేషన్లు అందజేశారు.
అలాగే పోశాల డేవిడ్ రాజ్, తిప్పని రాంమూర్తి, బి.రాంచందర్‌రావు, నల్లెల సతీష్ కుమార్, అబ్బాది రవీందర్, ఎం.సంధ్య, సంగి ప్రశాంత్, పెండ్లి జనార్దన్, బొట్ల రాజిరెడ్డి, గోనే రాజు, ఐలి సాంబయ్య, అర్షం అశోక్, కె.కన్నయ్య, కుమ్మరి కన్నయ్య స్వతంత్రులుగా బరిలో నిలిచారు. పరకాల నియోజకవర్గానికి మొత్తం 61 నామినేషన్లు అందినట్లు రిటర్నింగ్ అధికారి వెల్లడించారు.
తూర్పులో నరేందర్...
వరంగల్ తూర్పులో బీఆర్‌ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ శుక్రవారం అట్టహాసంగా నామినేషన్ దాఖలుచేశారు. ఈ సందర్భంగా శివనగర్‌లోని తన నివాసం నుంచి మండిబజార్, పోచమ్మమైదాన్ మీదుగా గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు సుమారు 20 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, హస్తకళల సంస్థ చైర్మన్ బొల్లం సంపత్, పలువురు కార్పొరేటర్లతో కలిసి నామినేషన్ వేశారు. మొత్తం మూడు సెట్లను దాఖలు చేశారు.
పలు నియోజకవర్గాల్లో...
ములుగులో బీఆర్‌ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి, డోర్నకల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జాటోతు రాంచంద్రునాయక్, బీజేపీ నుంచి మహబూబాబాద్‌లో హుస్సేన్‌నాయక్, వర్ధన్నపేటలో కొండేటి శ్రీధర్, నర్సంపేటలో కంభంపాటి పుల్లారావు, వరంగల్ తూర్పులో ఎర్రబెల్లి ప్రదీ్‌పరావు, జనగామలో ఆరుట్ల దశమంత్ రెడ్డి నామినేషన్లు వేశారు.
Updated Date - 2023-11-10T23:59:34+05:30 IST