పరిశీలిస్తూ.. ప్రశ్నిస్తూ..
ABN, Publish Date - Dec 30 , 2023 | 12:38 AM
మేడిగడ్డలో మంత్రుల బృందం పర్యటన ఉత్కంఠంగా.. ఉత్సాహంగా.. సాగింది. వారు అన్ని విష యాలను ప్రశ్నిస్తూ.. ప్రాజెక్టును పరిశీలిస్తూ సాగింది. శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటలకు భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ల బృందం చేరుకుంది.
మేడిగడ్డలో ఉత్కంఠగా మంత్రుల బృందం పర్యటన
మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించిన మంత్రులు
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇంజనీర్ల పవర్ పాయింట్ ప్రజంటేషన్
వాస్తవాలు ప్రజలకు చెప్పాలని మంత్రుల ఆదేశాలు
నాలుగు గంటల పాటు సాగిన ప్రాజెక్టు సందర్శన
భూపాలపల్లి, ఆంధ్రజ్యోతి/మహదేవపూర్ రూరల్, డిసెంబరు 29: మేడిగడ్డలో మంత్రుల బృందం పర్యటన ఉత్కంఠంగా.. ఉత్సాహంగా.. సాగింది. వారు అన్ని విష యాలను ప్రశ్నిస్తూ.. ప్రాజెక్టును పరిశీలిస్తూ సాగింది. శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటలకు భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ల బృందం చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం 40 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన మంత్రుల బృందానికి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో పాటు జిల్లా అధికారులు మంత్రుల బృందానికి పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. హెలిప్యాడ్ నుంచి కాన్వాయ్‌లో ఎల్‌అండ్‌టీ క్యాంపు కార్యాలయానికి మంత్రులు చేరుకున్నారు. అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం ఏర్పాట్లు చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు నిర్మించినప్పటికీ ఇక్కడి రైతాంగానికి చుక్క నీరు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అందడం లేదని స్పష్టం చేశారు. ఇక్కడి రైతులు తమ భూములను త్యాగం చేసినా వారిని గుర్తించలేదని, అలాగే ముంపు ప్రాంతాలతో రైతులు నష్టపోతున్నారని, దీనిపై వివరణ ఇవ్వాలని కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ల బృందాన్ని కోరారు. అనంతరం భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో వాస్తవాలు ప్రజలకు తెలవాలని ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రాజెక్టు ఈఎన్‌సీ మురళీధర్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ శైలి, ఎత్తిపోతలు, ఖర్చుల వివరాలను వెల్లడించారు. తర్వాత రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌లు ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై మాట్లాడారు. మధ్యాహ్నం 3.50 గంటలకు సమీక్ష ముగించిన మంత్రుల బృందం లంచ్ అనంతరం కుంగిన మేడిగడ్డ బ్యారేజీ వంతెన వద్దకు వెళ్ళి పరిశీలన చేశారు. సుమారు అర్ధగంట తర్వాత తిరిగి హెలిప్యాడ్‌కు వెళ్లిన మంత్రుల బృందం అక్కడి నుంచి అన్నారం బ్యారేజీకి హెలికాప్టర్‌లో బయలుదేరి వెళ్లారు. బ్యారేజీని మంత్రుల బృందం పరిశీలించింది.
కాళేశ్వరంతో ప్రయోజనం ఏదీ?
ముంపుతో రైతులకు మరింత నష్టం
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
కాళేశ్వరం ప్రాజెక్టుతో స్థానిక రైతులకు ప్రయోజనం శూన్యమని, భూములను ప్రాజె క్టు కోసం త్యాగాలు చేసిన రైతులకు కూడా గత ప్రభుత్వం చుక్క నీరు ఇవ్వకుండా అ న్యాయం చేసిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నా రు. శుక్రవారం మేడిగడ్డ వద్ద పవర్ పాయిం ట్ ప్రజంటేషన్ ముందు, తరువాత మంత్రి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇక్కడి రైతులు వేల ఎకరాల భూము లు ఇచ్చారని, ప్రాజెక్టు పేరు తో కోట్ల విలువ చేసే ఇసుక ను దోచుకెళ్లారని, అయినప్పటికీ ఇక్కడి రైతాంగానికి కాళేశ్వరం ప్రాజెక్టుతో పైసా ప్రయోజనం కలగలేదని ఆరోపించారు. పైగా కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో వందలాది ఎకరాల రైతుల భూములు నీట మునుగుతున్నాయన్నారు. మంథని, చెన్నూ రు నియోజకవర్గాల్లోని రైతులకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల రైతులకు ఏ మాత్రం ప్రయోజనం లేదని తె లిపారు. ఈ రెండు జిల్లాల్లోనే మేడిగడ్డ, అ న్నారం, సుందిళ్ల బ్యారేజీలు కన్నెపల్లి, సుంది ళ్ల పంప్‌హౌ్‌సలు నిర్మాణం చేశారని, అయినప్పటికీ ఒక్క ఎకరానికి కూడా రైతులకు సాగునీరు అందకపోవడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును సైతం గత ప్రభుత్వం చిన్నచూపు చూసిందని మంత్రి ఆరోపించారు. గత వైఎస్సార్ హయాంలో కాటారం డివిజన్ రైతులకు సుమారు 50వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో అప్పుడు ప్రాజెక్టు నిర్మించామని, అయితే, గత ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు నిధులు కేటాయించక పోవడంతో రైతులు సాగునీటికి ఇబ్బందులు పడాల్సి వచ్చిందన్నారు. త్వరలోనే చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి.. రైతులకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడం, నష్టం వివరాలను ప్రజలకు వివరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రజాధనంతో పెద్ద ఎత్తున నిర్మించిన ఈ ప్రాజెక్టులో ఏం జరిగిందో ప్రజలకు తెలియాల్సి ఉందన్నారు. రాష్ట్ర సంపదను సక్రమంగా వినియోగించాలనే ఉద్ధేశ్యంతో తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల రైతులను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఆదుకునేందుకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు అయిత ప్రకా్‌షరెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కాచే శశిభూషణ్, మహదేవపూర్ జడ్పీటీసీ గుడాల అరుణ, ఎంపీపీ రాణిబాయి-రామారావు, అంబట్‌పల్లి సర్పంచ్ విలా్‌సరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 30 , 2023 | 12:38 AM