ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఉత్తమ ఫలితాలే ‘లక్ష్యంగా..

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:43 PM

పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించే ఉద్దేశంతో ఎస్‌సీఈఆర్‌టీ (రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి) ఈ విద్యా సంవత్సరం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. దీనికి ‘లక్ష్య’ అని నామకరణం చేశారు. ఈ ప్రణాళిక అమలు నేపథ్యంలో కొన్ని నెలల క్రితమే ఉపాధ్యాయులకు ట్రైనింగ్‌ ఇచ్చారు.

కోలుకొండ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక తరగతులను పరిశీలిస్తున్న డీఈవో

టెన్త్‌ విద్యార్థుల కోసం ‘లక్ష్య’ పేరుతో ప్రత్యేక ప్రణాళిక

ఉదయం, సాయంత్రం పునశ్చరణ తరగతులు

చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ

జిల్లాలో 6,692 మంది విద్యార్థులు

జనగామ కల్చరల్‌, డిసెంబరు 17: పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించే ఉద్దేశంతో ఎస్‌సీఈఆర్‌టీ (రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి) ఈ విద్యా సంవత్సరం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. దీనికి ‘లక్ష్య’ అని నామకరణం చేశారు. ఈ ప్రణాళిక అమలు నేపథ్యంలో కొన్ని నెలల క్రితమే ఉపాధ్యాయులకు ట్రైనింగ్‌ ఇచ్చారు. జిల్లా లోని ప్రభుత్వ, స్థానిక సంస్థల్లోని ఉన్నత పాఠశాలలు, కేజీబీవీ, మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎస్‌సీఈఆర్‌టీ ఆచరణాత్మకమైన ప్రణాళికను ఈ విద్యా సంవత్సరం (2023-24)లో రూపొందించింది.

పాఠశాలల్లో ఒకే విధంగా..

రాష్ట్ర స్థాయిలో అన్ని పాఠశాలల్లో ఎస్‌ఎ్‌ససీ విద్యార్థులందరికీ ఒకే విధంగా ప్రత్యేక తరగతుల నిర్వహణ కోసం ‘లక్ష్య’ పేరుతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఎస్‌ఎ్‌ససీలో మెరుగైన ఫలితాలు సాధించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం 10వ తరగతి విద్యార్థులకు ఉదయం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. జనవరి నెల నుంచి ఉదయం, సాయంత్రం కూడా తరగతులు నిర్వహించనున్నారు. జనవరి నెల నుంచి రెగ్యులర్‌ పీరియడ్లలో రెండు రోజులకు ఒక పాఠం, అభ్యాసాల రివిజన్‌ చేయనున్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు స్లిప్‌ టెస్టులు, ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థులను గ్రూపులుగా విభజించి వారు ఏయే సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్నారో గుర్తించి వాటి పైన తిరిగి అవగాహన కల్పిస్తారు. జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఉపాధ్యాయులకు ‘లక్ష్య’ కార్యక్రమంపై శిక్షణ ఇచ్చారు.

బోధనకు ప్రణాళిక

పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు చేపట్టిన లక్ష్య కార్యక్రమానికి ప్రణాళికను ఈ విధంగా తయారు చేశారు. 1. సూక్ష్మ ప్రణాళిక, 2. ప్రత్యేక తరగతులు, 3. పబ్లిక్‌ పరీక్షలు - ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక, 4. ఉపాధ్యాయుల సమావేశాలు 5. తల్లిదండ్రులు, పోషకుల సమావేశం.

ఆచరణ ఇలా ..

లక్ష్య కార్యక్రమంలో ప్రధానంగా సూక్ష్మస్థాయి ప్రణాళికలు ముఖ్యమైనవి. ఆచరణాత్మకమైన నెలవారీ సూక్ష్మస్థాయి ప్రణాళికలు, రాష్ట్ర స్థాయి సబ్జెక్టు ఎక్స్‌పర్ట్స్‌, మోడల్‌ స్కూల్స్‌, గురుకుల పాఠశాలల ఎక్స్‌పర్ట్స్‌, ఉన్నత పాఠశాలల, మోడల్‌ స్కూళ్ల ప్రధానోపాధ్యాయులతో వర్క్‌షాపు నిర్వహిస్తారు. ఇందులో ‘లక్ష్య’ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తారు. ఒక నెలలోని పని దినాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను విభజించి బోధనా ప్రణాళికను రూపొందిస్తారు. ఆయా పాఠ్యాంశాల వారీగా కేటాయించిన పీరియడ్లలో 50 శాతం బోధనకు, 50 శాతం పరీక్షలకు విద్యార్థులను సిద్దం చేసేలా అభ్యాసం చేయించడానికి కేటాయిస్తారు. స్లిప్‌ టెస్టులు, ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తారు. ఆయా పాఠ్యాంశాల వారీగా ఎప్పటికప్పుడు పదోతరగతి విద్యార్థుల కోసం రూపొందించిన వివిధ సబ్జెక్టుల అభ్యాస దీపికల ద్వారా అవగాహన కల్పిస్తారు. వీటితో పాటు నవంబరు, డిసెంబరు మాసాల్లో రోజుకు ఒక ప్రత్యేక తరగతిని.. అదేవిధంగా జనవరి నుంచి మార్చి వరకు రోజుకు రెండు స్పెషల్‌ క్లాసులను తీసుకుంటారు. పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించి సంసిద్ధ పరచడమే కాకుండా తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహిస్తారు. పిల్లల ప్రగతిని తల్లిదండ్రులకు తెలియపరుస్తారు. పబ్లిక్‌ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా లఘు పరీక్షలు నిర్వహిస్తారు. పిల్లల జవాబులను పరిశీలించి చర్చ ద్వారా సరిదిద్దుతారు.

జిల్లా వ్యాప్తంగా 6,692 మంది విద్యార్థులు

జిల్లాలో పదో తరగతి నిర్వహించేవి 141 ప్రభుత్వ పాఠశాలలు, 42 ప్రైవేటు పాఠశాలలతో మొత్తం 183 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారుగా 6692 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. కాగా ప్రభుత్వ పాఠశాలలు ‘లక్ష్య’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి.

ఉత్తీర్ణత శాతం పెంచేందుకు దోహదం : కె.రాము, డీఈవో

ఎస్‌ఎ్‌ససీలో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ‘లక్ష్య’ ప్రణాళిక ఉపయోగపడుతుంది. ఇప్పటికే టెన్త్‌ క్లాసులో వివిధ సబ్జెక్టుల ఉపాధ్యాయులకు ఈ కార్యక్రమంపై రిసోర్స్‌ పర్సన్ల సహాయంతో శిక్షణ ఇచ్చాం. ఉపాధ్యాయులు శిక్షణ అంశాలను అమలు పరుస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తూ ‘లక్ష్య’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.

Updated Date - Dec 17 , 2023 | 11:43 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising