ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆధునిక వైద్య విధానాలతో క్యాన్సర్‌కు చికిత్స

ABN, Publish Date - Dec 18 , 2023 | 03:10 AM

ఆధునిక వైద్యవిధానాలతో క్యాన్సర్‌కు మెరుగైన చికిత్స అందించవచ్చని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి మెడికల్‌ ఆంకాలజీ విభాగపు అధిపతి డాక్టర్‌ సెంథిల్‌ రాజప్ప అన్నారు.

బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి డాక్టర్‌ సెంథిల్‌ రాజప్ప

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఆధునిక వైద్యవిధానాలతో క్యాన్సర్‌కు మెరుగైన చికిత్స అందించవచ్చని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి మెడికల్‌ ఆంకాలజీ విభాగపు అధిపతి డాక్టర్‌ సెంథిల్‌ రాజప్ప అన్నారు. గతంలో క్యాన్సర్‌ వచ్చిందంటే జీవితం ముగిసినట్లేనని భావించేవార ని, ప్రస్తుతం అందుబాటులోనికి వచ్చిన ఆధునిక వైద్య విధానాల కారణంగా చికిత్స విధానంలో మార్పు వచ్చిందని, క్యాన్సర్‌ వచ్చినా తిరిగి సాధారణ జీవనాన్ని సాగించవచ్చనే భావన ప్రజల్లో రావడం సంతోషకరమని ఆయన అన్నారు. ఫ్రెండ్స్‌ ఆఫ్‌ మాక్స్‌ ఫౌండేషన్‌(ఎ్‌ఫవోఎమ్‌) క్యాన్సర్‌ సపోర్టు గ్రూపు, బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి, రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ సంయుక్తంగా క్రానిక్‌ మైలోజీన్‌సలుకేమియా(సీఎంఎల్‌)అనే బ్లడ్‌ కేన్సర్‌, జీర్ణవ్యవస్థలో ఏర్పడే గ్యాస్ట్రోఇన్‌టెస్టినల్‌ స్ట్రోమల్‌ ట్యూమర్‌(గి్‌స్ట)అనే క్యాన్సర్‌ వ్యాధిగ్రస్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సెంథిల్‌ మాట్లాడుతూ.. ఆధునిక చికిత్సను అందరికీ అందుబాటులో తీసుకురావడం కొంత కష్టమైనప్పటికీ ఎఫ్‌వోఎమ్‌ ఫౌండేషన్‌ లాంటి సంస్థల కారణంగా కొంత సహాయం అందుతోందని అన్నారు. పెరుగుతున్న వైద్య విజ్ఞానంతో ఎక్కువ శాతం మంది రోగులు మరణాల బారిన పడకుండా కాపాడగలుగుతున్నామని మెడికల్‌ ఆంకాలజిస్టు డాక్టర్‌ కృష్ణమోహన్‌ అన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 03:10 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising