ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పాలనపై పట్టు దిశగా!

ABN, Publish Date - Dec 18 , 2023 | 02:38 AM

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. పరిపాలనపై పట్టు బిగించే దిశగా కార్యాచరణను మరింత వేగవంతం చేస్తున్నారు. వాస్తవానికి పాలనా పగ్గాలు చేపట్టిన నాటినుంచే క్షేత్రస్థాయి సమస్యలు, అభివృద్ధి అంశాలపై ఆయన దృష్టి సారించారు.

మరింత స్పీడ్‌ పెంచిన సీఎం

21న కలెక్టర్లతో కాన్ఫరెన్స్‌

రెవెన్యూ, ధరణి సహా పలు అంశాలపై ఆరా

కౌలు రైతుల గుర్తింపు, రేషన్‌ కార్డుల జారీతోపాటు క్షేత్రస్థాయి అభివృద్ధి ప్రణాళికలపై చర్చ

ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి కలెక్టర్లతో రేవంత్‌ సమావేశ

హైదరాబాద్‌, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. పరిపాలనపై పట్టు బిగించే దిశగా కార్యాచరణను మరింత వేగవంతం చేస్తున్నారు. వాస్తవానికి పాలనా పగ్గాలు చేపట్టిన నాటినుంచే క్షేత్రస్థాయి సమస్యలు, అభివృద్ధి అంశాలపై ఆయన దృష్టి సారించారు. ఇప్పటికే ఒక్కో విభాగంపై వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి అంశంపైనా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను పరిశీలిస్తూ అధికారులను క్షుణ్ణంగా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. విషయాన్ని ఆకళింపు చేసుకుంటూ, వారికి తాను ఇవ్వాల్సిన ఆదేశాలిస్తూ, దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగా.. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి జిల్లాల కలెక్టర్లతో ఈ నెల 21న సమావేశం కానున్నారు. సచివాలయంలో ఈ సమావేశం జరగనున్నట్లు, ఇందుకోసం సీఎంవో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రధానంగా భూ రికార్డులతో ముడిపడిన సమస్యలు, కౌలురైతుల గుర్తింపు, కొత్త రేషన్‌ కార్డుల జారీ, మహాలక్ష్మి పథకాల అమలు అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి. వీటితోపాటు క్షేత్రస్థాయిలో పలు అంశాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా కలెక్టర్లు వెంట తీసుకురావాలని ప్రభుత్వం సూచించనుంది. ఈ సందర్భంగా రెవెన్యూకు సంబంధించిన అంశాలపై కీలకంగా చర్చ జరగనున్నట్లు, ధరణి పోర్టల్‌లోని సమస్యలపై కలెక్టర్లను సీఎం వివరాలు అడగనున్నట్లు సమాచారం. సాఽధారణంగా వివిధ శాఖల కార్యదర్శులు, హెచ్‌వోడీలు రాష్ట్ర స్థాయిలో ఉన్నప్పటికీ.. జిల్లాల పరిపాలనలో కలెక్టర్లదే కీలకపాత్ర. క్షేత్రస్థాయిలో పరిపాలన ఎలా ఉంది? సమస్యలు ఏంటనే విషయాలపై కలెక్టర్ల వద్ద పూర్తి సమాచారం ఉండడంతోపాటు వాటన్నింటిపై వారు అవగాహన కలిగి ఉంటారు. అదే సమయంలో ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న పథకాలకు వీరే కీలకమవుతారు. ఈ నేపథ్యంలో కలెక్టర్లతో కాన్ఫరెన్స్‌లో తమ ప్రభుత్వ ఆలోచనలు, అభివృద్ధి ప్రణాళికలు, సమస్యల పరిష్కారానికి ఏం చేయాలన్న దానిపై సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు.

కౌలు రైతులు, రేషన్‌కార్డుల జారీపై చర్చ..

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండింటిని ఇప్పటికే అమలుచేయగా.. మిగతా వాటి అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లతో సమావేశంలో సీఎం రేవంత్‌ చర్చించనున్నారు. ఆరు గ్యారెంటీల్లో కౌలు రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తామన్నది కూడా ఒకటి అనే విషయం తెలిసిందే. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వాస్తవ సాగుదారులు, కౌలు రైతులు ఎవరనే విషయంపై కలెక్టర్లతో సీఎం కీలకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. కౌలుదారుల గుర్తింపునకు తలెత్తే సమస్యలేంటి? ఏ ప్రామాణికంగా కౌలు రైతులను గుర్తించాలి? వారికి గుర్తింపు కార్డు ఎలా ఇవ్వాలి? అనే అంశాలపై మాట్లాడనున్నారు. దీంతోపాటు రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డుల జారీ, కొత్త సభ్యుల నమోదు సహా పలు సమస్యలున్నాయి. వాటిపై ఎలా ముందుకెళ్లాలి? కొత్త రేషన్‌కార్డుల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? అనే అంశాలపైనా అధికారులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ప్రతి నెలా రూ.2,500, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ సహా పలు స్కీమ్‌లపైనా లోతుగా చర్చించనున్నారు. వాస్తవానికి రాష్ట్రస్థాయి అధికారులు, విభాగాల అధిపతులు, కలెక్టర్లతో ఇలాంటి సమావేశాలు ఉమ్మడి ఏపీలో ప్రతి ఆరు నెలలకోసారి నిర్వహించేవారు. కానీ, గడచిన పదేళ్లలో ఇలాంటి సమావేశాలు పెద్దగా జరగలేదనే చర్చ ఉంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం రేవంత్‌ జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Updated Date - Dec 18 , 2023 | 02:38 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising