ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇంద సూట్‌కేసు.. ఇక సర్దుకోండి..!

ABN, First Publish Date - 2023-12-03T03:46:42+05:30

‘‘కేసీఆర్‌ పాలనకు ఎండ్‌ కార్డ్‌ పడబోతోంది. ఆయన, సూట్‌కేసు సర్దుకుని ప్యాకప్‌ చేసుకునే టైమొచ్చింది. బై బై కేసీఆర్‌! ’’ అంటూ సీఎం కేసీఆర్‌పై వైఎ్‌సఆర్టీపీ అధినేత్రి షర్మిల సెటైర్లు వేశారు.

మీరు ప్యాకప్‌ చేసుకునే టైమొచ్చింది

కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ చీఫ్‌ షర్మిల సెటైర్లు

ఆయనకు సూట్‌కేసును గిఫ్ట్‌గా పంపనున్నట్లు వెల్లడి

హైదరాబాద్‌, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): ‘‘కేసీఆర్‌ పాలనకు ఎండ్‌ కార్డ్‌ పడబోతోంది. ఆయన, సూట్‌కేసు సర్దుకుని ప్యాకప్‌ చేసుకునే టైమొచ్చింది. బై బై కేసీఆర్‌! ’’ అంటూ సీఎం కేసీఆర్‌పై వైఎ్‌సఆర్టీపీ అధినేత్రి షర్మిల సెటైర్లు వేశారు. ఆయన సర్దుకునేందుకు ఒక సూట్‌కేసును గిఫ్ట్‌గా పంపిస్తున్నట్లు ప్రకటించిన ఆమె.. ఆ సూట్‌కేసును ప్రదర్శించారు. వైఎస్సార్‌టీపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడారు. కీలకమైన ఈ ఎన్నికల్లో తాము పోటీ చేసి నియోజకవర్గానికి 5 వేల ఓట్ల చొప్పున చీల్చినా తేడా వస్తుందని, కేసీఆర్‌ను ఓడించేందుకే కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇచ్చామని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు కలిసే ఉన్నాయన్న సంగతి తెలగాణ ప్రజలకు అర్థమైపోయిందన్నారు. 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీపీ, ఇతర పార్టీల నుంచి గెలిచిన 40 మంది ఎమ్మెల్యేలను, ఒక ఎంపీ, నలుగురు ఎమ్మెల్సీలను కేసీఆర్‌ కొనుగోలు చేశారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితాలను రిఫరెండంగా తీసుకోవాలే తప్ప ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేయొద్దని కేసీఆర్‌ను డిమాండ్‌ చేశారు. కాగా కాంగ్రెస్‌ పార్టీలో ఎవరు సీఎం కావాలన్నది ఆ పార్టీ నిర్ణయిస్తుందని షర్మిల అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో క్రెడిబిలిటీ ఉన్న నేతలు చాలా మందే ఉన్నారని పేర్కొన్నారు. ఆర్మీలో పని చేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దళిత నాయకుడు భట్టి విక్రమార్క వంటి వారు ఉన్నారన్నాన్నారు.

Updated Date - 2023-12-03T03:46:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising