ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రాజీమార్గమే రాజమార్గం : జడ్జి వేణు

ABN, Publish Date - Dec 30 , 2023 | 11:51 PM

రాజీమార్గమే రాజమార్గమని, ఒక్క క్షణం ఆలోచించం డి... పశ్చాత్తాపం తో కేసులను రాజీచేసుకోవడం ద్వా రా మీ జీవితం బంగారమవుతుందని మిర్యాలగూడ ఐదవ అదనపు జిల్లా జడ్జి వేణు అన్నారు.

రాజీమార్గమే రాజమార్గం : జడ్జి వేణు

అవార్డును అందజేస్తున్న జడ్జి వేణు

మిర్యాలగూ డ లీగల్‌, డి సెంబరు 30: రాజీమార్గమే రాజమార్గమని, ఒక్క క్షణం ఆలోచించం డి... పశ్చాత్తాపం తో కేసులను రాజీచేసుకోవడం ద్వా రా మీ జీవితం బంగారమవుతుందని మిర్యాలగూడ ఐదవ అదనపు జిల్లా జడ్జి వేణు అన్నారు. కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలతలో ఆయన పాల్గొని మా ట్లాడారు. క్షణికావేశంలో చేసిన తప్పులకు జీవితాలు నాశనం చేసుకోకుండా కు టుంబం కోసం ఒక్క క్షణం ఆలోచించి రాజీమార్గం ద్వారా కేసులను లోక్‌అదాలతలో పరిష్కరించుకొని సుఖమయ జీవితం గడపాలన్నారు. కోర్టుల చుట్టూ తిరుగుతూ కాలయాపన చేస్తూ ఆర్థికంగా నష్టపోకుండా కుటుంబ గౌరవాన్ని కాపాడాలన్నారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి సుజయ్‌ మాట్లాడుతూ రాజీమార్గం రాజమార్గమని, కక్షిదారుల కేసుల సత్వర పరిష్కారానికి లోక్‌ అదాలతలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కక్షిదారులకు సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో మాస్కులు, బార్‌ అసోసియేషన ఆధ్వర్యంలో కక్షిదారులకు పులిహోర పంపిణీ చేశారు. కార్యక్రమంలో జూనియర్‌ సివిల్‌ జడ్జి ఆశలత, అదనపు జూనియర్‌ సివిల్‌జడ్జి సుమబాల, బార్‌ అసోసియేషన అధ్యక్షుడు కె.శ్రీనివా్‌సరెడ్డి, ప్రధాన కార్యదర్శి వాకిటి శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడు ఎంవి.పవనకుమార్‌, లోక్‌అదాలత సభ్యులు ఎస్‌ఆర్‌కె.ప్రభాకర్‌, గంగాభవాని, న్యాయవాదులు ఎ.నరేందర్‌రెడ్డి, రాజేష్‌, మనోహర్‌రెడ్డి, శ్రీనివాస్‌, సత్యసాయి సేవా సమితి సభ్యులు శ్రీనివాసగుప్తా, చిల్లంచర్ల ఆదినారాయణ, సాంబశివుడు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2023 | 11:51 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising