ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రాష్ట్రంలో ‘వికసిత్‌’ యాత్ర షురూ

ABN, Publish Date - Dec 17 , 2023 | 04:22 AM

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర రంగారెడి, మేడ్చల్‌ జిల్లాల్లో శనివారం ప్రారంభమైంది. ప్రధాని మోదీ వర్చువల్‌గా యాత్రను ప్రారంభించారు.

అట్టడుగు వర్గాలకు పథకాలు అందించడమే భారత్‌ సంకల్ప యాత్ర లక్ష్యం: గవర్నర్‌ తమిళిసై

కేంద్ర పథకాలను అర్హులందరూ వినియోగించుకోవాలి

రంగారెడ్డి జిల్లాలో యాత్రలో కిషన్‌ రెడ్డి

శంషాబాద్‌, శామీర్‌పేట, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర రంగారెడి, మేడ్చల్‌ జిల్లాల్లో శనివారం ప్రారంభమైంది. ప్రధాని మోదీ వర్చువల్‌గా యాత్రను ప్రారంభించారు. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలం బొమ్మరాసిపేటలో రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌.. వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర ప్రచారరథాన్ని శనివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర పథకాలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న అట్టడుగువర్గాల వారి చేరాలన్నదే వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ యాత్ర ద్వారా ప్రఽథకాలపై రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. జనవరి 26 వరకు జిల్లాలో ఈ యాత్రను కొనసాగుతుందని ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వ్యవసాయ, ఆహార, బ్యాంకుల రుణ పథకాల ఎగ్జిబిషన్‌ స్టాల్‌ను గవర్నర్‌, కలెక్టర్‌ గౌతమ్‌తో కలిసి తిలకించారు. రాష్ట్ర ప్రిబబు అధికారి రాష్ట్ర అదనపు కార్యదర్శి శాంతమను, కలెక్టర్‌ గౌతమ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌, గవర్నర్‌ జాయింట్‌ సెక్రటరీ రఘుప్రసాద్‌, రాష్ట్ర రెడ్‌ క్రాస్‌ కన్వీనర్‌ రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం చిన్నగోల్కొండ గ్రామంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి.. వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని యాత్ర వాహనాన్ని జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడు తూ.. కేంద్రం అమలు చేస్తున్న పథకాలు అర్హత కలిగిన లబ్ధిదారులు వినియోగించుకునేలా అధికారులు కృషి చేయాలని అన్నారు. 17 రకాల కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.

శబరిమలలో సౌకర్యాలు కల్పించండి

కేరళ సీఎంకు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి లేఖ

శబరిమలలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేరళ ముఖ్యమంతి పినరయి విజయన్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శనివారం లేఖ రాశారు. అయ్యప్ప స్వామి క్షేత్రంలో కనీస ఏర్పాట్ల లేమి వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. శబరిమలపై, భక్తుల పాదయాత్ర మార్గాల్లో భోజనం, నీరు, వైద్యంతో పాటు స్వాములకు అవసరమైన ఇతర ఏర్పాట్లను వెంటనే చేయాలని కోరారు.

Updated Date - Dec 17 , 2023 | 04:32 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising