ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అయోధ్య ఆలయ నిర్మాణం ఆత్మగౌరవానికి ప్రతీక

ABN, Publish Date - Dec 18 , 2023 | 12:25 AM

మర్యాదా పురుషోత్తముడు శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో ఆలయ నిర్మాణం హిందువుల ఆత్మగౌరవానికి ప్రతీక అని సాయిధామం పీఠాధిపతి రామానంద స్వామి అన్నారు

భువనగిరిలో అయోధ్య రాముడి అక్షింతల ఊరేగింపులో పీఠాధిపతి రామానంద స్వామి

భువనగిరి టౌన్‌, డిసెంబరు 17: మర్యాదా పురుషోత్తముడు శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో ఆలయ నిర్మాణం హిందువుల ఆత్మగౌరవానికి ప్రతీక అని సాయిధామం పీఠాధిపతి రామానంద స్వామి అన్నారు. గడపగడపకు అయోధ్య రాముని అక్షింతల వితరణ కార్యక్రమాన్ని ఆదివారం భువనగిరిలో ప్రారంభించి మాట్లాడారు. ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా అయోధ్య ఆలయాన్ని సంద ర్శించాల న్నారు. నూతన ఆలయంలో రాముడి విగ్రహ ప్రతి ష్టాపనను పురస్కరించుకొని జనవరి 22న ఇంటింటా దీపావళి జరు పుకోవాలన్నారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పోత్నక్‌ రఘు వేందర్‌, సుక్క శ్రీశైలం, కేమోజు మల్లిఖార్జునచారి, చామ రవీందర్‌, పోన్నాల వినయ్‌, కొల్లోజు సతీష్‌ పాల్గొన్నారు.

చౌటుప్పల్‌ టౌన్‌: అయోధ్య రామమందిరం నుంచి వచ్చిన పూజిత అక్షతలను ఇంటింటికీ పంపిణీ చేస్తామని వీహెచ్‌పీ జిల్లా ప్రచారక్‌ మన్నె ప్రతాప్‌రెడ్డి అన్నారు. అయోధ్య రామమందిరం నుంచి వచ్చిన పూజిత అక్షతల కలశానికి ఆధివారం రాత్రి చౌటుప్పల్‌ పట్టణంలో వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్‌, భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు స్వాగతం పలికి సీతారామ చంద్రస్వామి దేవాలయానికి తీసుకెళ్లారు. పూజిత అక్షత లను మండలంలోని అన్ని గ్రామాలకు పంపిణీ చేస్తామని, ఈ నెల 22న అయోధ్య రామమందిరంలో జరిగే ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఈ అక్షతలతో ఇళ్లలోని దేవతా విగ్రహాల వద్ద భక్తులు పూజలు చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్‌ బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ పి. శ్రీధర్‌బాబు, అయ్యప్ప స్వామి దేవాలయ అధ్యక్షుడు బి. మురళి, గంజి నర్సింహులు, సుక్క సుదర్శన్‌, వనం ధనుంజయ్య, బడుగు సావిత్రి, గోశిక బిక్షపతి, గోశిక అంజయ్య, గోశిక నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

వలిగొండ: భువనగిరి నుంచి అయోధ్య రాముడి అక్షింతలు ఆదివారం మండలకేంద్రానికి భక్తులు తీసుకువచ్చారు. ఆక్షింతలను మండలకేంద్రంలో ఊరేగింపుగా తీసుకొచ్చి రామాలయంలో ఉంచారు. కార్యక్రమంలో నాయకులు పాండు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 12:25 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising