ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రజా సమస్యల పరిష్కారమే సీపీఐ లక్ష్యం

ABN, Publish Date - Dec 26 , 2023 | 11:40 PM

:ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం చేసి, పేదల పక్షాన నిలబడే పార్టీ సీపీఐ అని ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఉస్తెల నారాయణరెడ్డి అన్నారు.

మేళ్లచెర్వులో కేక్‌ కట్‌ చేస్తున్న సీపీఐ నాయకులు

మేళ్లచెర్వు, డిసెంబరు 26:ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం చేసి, పేదల పక్షాన నిలబడే పార్టీ సీపీఐ అని ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఉస్తెల నారాయణరెడ్డి అన్నారు. మండలకేంద్రంలో సీపీఐ వ్యవ స్థాపక దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్య దర్శి చింత్రియాల రవి, దొంగలంక రాజు, చిత్తలూరి వీరబాబు, గోనె వెంక య్య, బాష, జియూలుద్దిన్‌, తాళ్లూరి సత్యం, సైదులు పాల్గొన్నారు.

కోదాడ రూరల్‌: దేశ సమైక్యత, సమగ్రత పరిరక్షణే ఎర్రజెండా లక్ష్యమని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్‌ అన్నారు. పట్టణంలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాసరావు, నాయకులు షేక్‌ లతీఫ్‌, ఉప్పతల శ్రీనివాస్‌, షేక్‌ జానీ, రమేష్‌, నాగుల్‌మీరా, కొండలు, పాపానాయక్‌, ఎస్‌కె మీరా, రహిమాన్‌, అంజమ్మ పాల్గొన్నారు.

గరిడేపల్లి: అధికారం కోసం కాకుండా పేద ప్రజల కోసం నిజాయితీగా పనిచేసేది కమ్యూనిస్టులేనని సీపీఐ మండల కార్యదర్శి పోకల వెంకటే శ్వర్లు అన్నారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో పార్టీ జెండా ఎగరవేశారు. కార్యక్రమంలో నాయకులు ఎడ్ల అంజిరెడ్డి, కడియాల అప్పయ్య, కుందురు వెంకటరెడ్డి, బెజ్జం రమేష్‌, వీరస్వామి, వెంకటరెడ్డి, నాగయ్య, సైదులు, నవీన్‌ వీరబాబు, తిరుపయ్య తదితరులు పాల్గొన్నారు.

నేరేడుచర్ల: నేరేడుచర్లలో సీపీఐ జెండాను రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్‌ ఎగురవేశారు. దున్నే వానికే భూమి నినాదంతో తెలంగాణ సాయిధ పోరాటం చేసి పది లక్షల ఎకరాలను పేదలకు పంచిన ఘన చరిత్ర మరిచిపోలేనిదన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ధూళిపాళ ధనుంజయనాయుడు, నాయకులు మేకల శ్రీనివాసరావు, యల్లబోయిన సింహాద్రి కత్తి శ్రీనివాసరెడ్డి, పున్నయ్య, రావుల సత్యం, చిలకరాజు శ్రీను, లక్ష్మి, ఊదర వెంకన్న, శ్రీపాద శ్రీనివాసరావు, కొండ అంజయ్య, భిక్షం, గోపి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

చిలుకూరు: ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ఉండాలని సీపీఐ సీనియర్‌ నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు దొడ్డా నారాయణరావు అన్నారు. సీపీఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండలకేంద్రంలో జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు సాహెబ్‌ అలీ, చిలువేరు ఆంజనేయులు, కొండా కోటయ్య, దొడ్డా వెంకటయ్య, కనకయ్య, బేగం, ఉపేందర్‌, శ్రీనివాస్‌, నాగేశ్వరరావు, వాసు పాల్గొన్నారు.

హుజూర్‌నగర్‌: మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని జిల్లా కమిటీ సభ్యుడు కంబాల శ్రీనివాస్‌ కోరారు. మండల పరిధిలోని అమరవరం గ్రామంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, సైదులు, ఉపేందర్‌, కృష్ణయ్య, వీరారెడ్డి, రాంరెడ్డి, నాగిరెడ్డి, శ్రీనివాస్‌, వెంకన్న, బిక్షం, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మఠంపల్లి: మఠంపల్లి, వర్ధాపురం గ్రామాల్లో సీపీఐ జెండాలు ఎగుర వేశారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి అమరావరపు పున్నయ్య, దాశరధి రామకృష్ణ, సన్నిగుండ్ల జాన్‌, కంటు మట్టయ్య, వి.రామయ్య, చాం ద్‌, కోటిరెడ్డి, ఆలీబాబా, బాలసైదా, నాగేశ్వరావు, చిన్నజాన్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 11:40 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising