ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఖమ్మం శ్రీరామ్‌ హిల్స్‌లో ఉద్రిక్తత

ABN, First Publish Date - 2023-11-22T04:06:50+05:30

ఖమ్మం నగర శివారులోని శ్రీరామ్‌ హిల్స్‌లో మంగళవారం రాత్రి ఉద్రిక్తత ఏర్పడింది. జిల్లా పోలీసు శాఖలో కీలక విధులు నిర్వహించిన మాజీ అధికారి సుభాష్‌ చంద్రబో్‌సకు చెందిన శ్రీరామ్‌హిల్స్‌లోని

పోలీస్‌ మాజీ అధికారి నివాసంలో..

డబ్బులున్నాయని సి విజిల్‌ యాప్‌లో ఫిర్యాదు.

తనిఖీలు నిర్వహించిన ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, ఐటీ అధికారులు

ఖమ్మం క్రైం, నవంబరు 21: ఖమ్మం నగర శివారులోని శ్రీరామ్‌ హిల్స్‌లో మంగళవారం రాత్రి ఉద్రిక్తత ఏర్పడింది. జిల్లా పోలీసు శాఖలో కీలక విధులు నిర్వహించిన మాజీ అధికారి సుభాష్‌ చంద్రబో్‌సకు చెందిన శ్రీరామ్‌హిల్స్‌లోని నివాసంలో బీఆర్‌ఎస్‌ ఖమ్మం అభ్యర్థి, మంత్రి అజయ్‌కుమార్‌కు సంబంధించిన డబ్బును భారీగా నిల్వ చేశారంటూ సి విజిల్‌ యాప్‌కు ఫిర్యాదు అందింది. దీంతో అప్రమత్తమైన ఎన్నికల అధికారులు, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌, ఐటీ అధికారులు మంగళవారం రాత్రి పోలీసు మాజీ అధికారి ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వర్గాల నాయకులు సదరు మాజీ అధికారి ఇంటి వద్దకు చేరుకొని ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలం వద్దకు చేరుకొని వారిని కట్టడి చేశారు. ఓ దశలో ఇరు వర్గాలు పరస్పర దాడులకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, నాయకుల మధ్య తోపులాట జరిగింది. అయితే ఈ తనిఖీల్లో ఎలాంటి నగదు పట్టుబడలేదని తెలిసింది. కావాలనే కుట్రపూరితంగా కాంగ్రెస్‌ నాయకులు తమపై ఆరోపణలు చేస్తున్నారని, న్యాయ పోరాటం చేస్తానని మాజీ పోలీసు అధికారి బోస్‌ విలేకరులకు తెలిపారు. ఇక తనిఖీలు జరుగుతాయన్న విషయం తెలుసుకొని ఇక్కడ నుంచి ముందుగా డబ్బును తరలించారని, అధికారుల జాప్యం చేశారని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన శ్రీరాంహిల్స్‌తో పాటు ఖమ్మం నగరంలో తీవ్రచర్చనీయాంశమైంది.

Updated Date - 2023-11-22T04:06:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising