తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించాలి
ABN, First Publish Date - 2023-12-12T00:18:54+05:30
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తొలితెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించాలని 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చక్రహరి రామరాజు అన్నారు.
సూర్యాపేటటౌన, డిసెంబరు 11 : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తొలితెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించాలని 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చక్రహరి రామరాజు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కిరాణా, ఫ్యాన్సీ మర్చంట్ అసోసియేషన భవనలో ఏర్పాటుచేసిన సంఘం జిల్లా ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకులు తమ మ్యానిఫెస్టోలో పొందుపర్చిన విధంగా తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల భూమి, హెల్త్ కార్డు, గౌరవభృతి, ఉచిత బస్‌పాస్ సౌకర్యం కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక నామినేట్ పోస్ట్ తెలంగాణ ఉద్యమకారులకు కేటాయించాలన్నారు. గత ప్రభుత్వంలో ఉద్యమకారులకు సరైన గుర్తింపు దక్కలేదని, కనీసం తమ సమస్యలను వినే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో తొలి, మలి పోరాటాల్లో తామంతా భాగస్వాములం అయ్యామన్నారు. తెలంగాణ ఉద్యమకారులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి లక్ష్మీనారాయణ, రాష్ట్ర నాయకులు ఖత్రం సీతారాంరెడ్డి, దేవతకిషననాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి విశ్వేశ్వరరావు, శివాజీరెడ్డి, బందురుధ్రమ్మ, చిత్రం భద్రమ్మ, కొత్తగురువయ్య, పాలవరపు వెంకటేశ్వర్లు, సుబ్బారెడ్డి, అరుణారెడ్డి, ముత్తినేని వెంకటేశ్వర్లు, వేమూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Updated Date - 2023-12-12T00:18:55+05:30 IST