ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

budget: రేపే తెలంగాణ బడ్జెట్‌

ABN, First Publish Date - 2023-02-05T21:44:45+05:30

సోమవారం ఉదయం 10.30 గంటలకు ఉభయసభల్లో తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ (Telangana budget) ప్రవేశపెట్టనుంది. శాసనసభలో మంత్రి హరీష్‌రావు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: సోమవారం ఉదయం 10.30 గంటలకు ఉభయసభల్లో తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ (Telangana budget) ప్రవేశపెట్టనుంది. శాసనసభలో మంత్రి హరీష్‌రావు (Minister Harish Rao) బడ్జెట్ ప్రవేశపెడుతారు. మండలిలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్ రూ.3 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే బడ్జెట్‌ను మంత్రివర్గం ఆమోదించింది. రేపు ఉదయం జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయంలో హరీష్‌రావు పూజలు చేసి అనంతరం అసెంబ్లీ (Assembly)లో బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు. ఇది ఎన్నికల బడ్జెట్‌ కావడంతో రాష్ట్రంలోని వివిధ వర్గాలు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నాయి. ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన పథకాలు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం, వాటి ప్రయోజనాలు ఆ వర్గాలకు అందకపోతుండడంతో ఈసారైనా తమ ఆకాంక్షలు నెరవేరతాయా.. అని వారు నిరీక్షిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధి కోసమంటూ ప్రవేశపెట్టిన దళితబంధు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకాలను చూపిస్తూ.. మిగతా పథకాలన్నింటినీ ప్రభుత్వం అటకెక్కించిందన్న ఆరోపణలున్నాయి.

ఈ నేపథ్యంలో 2023-24 బడ్జెట్‌లోనైనా సంక్షేమానికి నిధులను పెంచుతారా లేదా అన్న చర్చ మెదలైంది. కేవలం బీసీ సంక్షేమ శాఖకే రూ.10 వేల కోట్లకు పైగా కేటాయించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. మరోవైపు ఈ ఏడాది దళితబంధు మాదిరిగానే ఎస్టీలకు గిరిజన బంధు కూడా ఇస్తామని సీఎం కేసీఆర్‌ (CM KCR) ప్రకటించారు. కానీ, దీని అమలుకు ఇంకా విధివిధానాలు ఖరారు చేయలేదు. దీంతో బడ్జెట్‌లో గిరిజనబంధుకు నిధులు ఉంటాయా లేదా అన్న సందిగ్ధం ఏర్పడింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2022-23) ఎస్సీ అభివృద్ధి శాఖకు రూ.20,624 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. గిరిజన శాఖకు రూ.3,415 కోట్లు, బీసీ శాఖకు రూ.5,697.55 కోట్లను కేటాయించింది.

Updated Date - 2023-02-05T21:44:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising