ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పోస్టింగుల కోసం తహసీల్దార్‌ల పరుగులు

ABN, First Publish Date - 2023-12-11T03:51:31+05:30

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జిల్లాలోని పలువురు అధికారులు పోస్టింగుల కోసం పరుగులు తీస్తున్నారు.

మంత్రుల, ఎమ్మెల్యేల వద్ద పలువురి పైరవీలు

నచ్చిన చోటుకు బదిలీ చేయించాలని విజ్ఞప్తులు

అనుకూలంగా పని చేస్తామంటూ హామీలు

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జిల్లాలోని పలువురు అధికారులు పోస్టింగుల కోసం పరుగులు తీస్తున్నారు. రెండు, మూడేళ్లుగా ప్రాధాన్యం లేని సీట్లలో కూర్చుని తీవ్ర అసహనంతో విధులు నిర్వర్తిస్తున్న పలువురు తహసీల్దార్లు ఇప్పుడైనా మంచి పోస్టింగుల్లో చేరాలని ఆసక్తి చూపుతున్నారు. ఈ మేరకు తమకు తెలిసిన మంత్రులు, ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి ఉన్నతాధికారులకు ఫోన్లు చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తరుణంలో జిల్లాలోని రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న కొంతమంది అధికారుల్లో ఉత్సాహం నెలకొంది. పాలన సంస్కరణల్లో భాగంగా ఏడాది క్రితం జిల్లాలో తహసీల్దార్లకు స్థానచలనం కలిగింది. ఈ క్రమంలో కొంతమంది అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో కలెక్టరేట్‌లోని వివిధ సెక్షన్లకు బదిలీ అయ్యారు. మరికొందరు ప్రాధాన్యం లేని మండలాలకు వెళ్లాల్సి వచ్చింది. అయితే పలు మండలాల్లో చురుగ్గా, నిజాయతీతో పనిచేస్తున్న అధికారులను కూడా స్థానిక ఎమ్మెల్యేల ఒత్తిడి మేరకు కలెక్టరేట్‌కు పంపించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. కాగా, తమకు ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా చేస్తామని, మండలాల్లో చేయాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చిన కొంతమంది, ప్రస్తుతం పైరవీల కోసం పరుగులు తీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అనుకూలంగా ఉంటామని హామీ

కోరుకున్న మండలాలకు పంపిస్తే మీరు చెప్పిన పనులు చేసి పెడతామని, అన్నింటికీ అనుకూలంగా ఉంటామని పలువురు తహసీల్దార్లు మంత్రులకు హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. నగరం నడిబొడ్డున ఉండే మండలాలకు తమను బదిలీ చేయించేలా ఉన్నతాధికారులకు చెప్పాలని కోరుతున్నట్లు తెలిసింది. రెండు రోజుల క్రితం ఇద్దరు తహసీల్దార్లు ఈ మేరకు ఓ మంత్రికి తమ సమస్యను విన్నవించున్నట్లు సమాచారం. తమను ఫలానా మండలాలకు పంపించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఇబ్బందులు పడిన అధికారులు కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనైన తమకు నచ్చిన ప్రదేశంలో ప్రశాంతంగా పనిచేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-12-11T03:51:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising