టీస్టాల్ దగ్ధం
ABN, First Publish Date - 2023-12-10T22:51:55+05:30
ప్రమాదవశాత్తు ఓ టీస్టాల్‌లో మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన ఘట్‌కేసర్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
సామగ్రికి మంటలంటుకుని రూ.5లక్షల నష్టం
ఘట్‌కేసర్ రూరల్, డిసెంబరు 10: ప్రమాదవశాత్తు ఓ టీస్టాల్‌లో మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన ఘట్‌కేసర్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్ మున్సిపాలిటీలోని బొక్కొనిగూడలో నివాసముండే గడీల శేఖర్‌రెడ్డి వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు మార్గంలో వందన హోటల్ సమీపంలో ‘టీటైమ్’ పేరుతో టీస్టాల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రోజూమాదిరిగానే శనివారం రాత్రి 10.30గంటలకు టీస్టాల్‌ను మూసివేసి ఇంటికి చేరుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున 5.00గంటలకు ప్రమాదవశాత్తు టీస్టాల్‌కు మంటలంటుకున్నాయి. స్థానికులు పోలీసులకు తెలియడంతో వారు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే టీ స్టాల్ పూర్తిగా దగ్ధమైంది. దాదాపు రూ.5లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Updated Date - 2023-12-10T22:51:56+05:30 IST