ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tarakaratna: బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కి తారకరత్న భౌతికకాయం

ABN, First Publish Date - 2023-02-18T23:16:48+05:30

సినీ హీరో నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) కన్నుమూశారు. బెంగుళూరులోని నారాయణా హృదయాలయ ఆస్పత్రిలో 23 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతన్న ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినీ హీరో నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) కన్నుమూశారు. బెంగుళూరు((Bangalore))లోని నారాయణా హృదయాలయ ఆస్పత్రిలో 23 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతన్న ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కాగా తారకరత్న భౌతికకాయాన్ని శనివారం రాత్రికి హైదరాబాద్(Hyderabad) తీసుకువచ్చి రంగారెడ్డి(RangaReddy) జిల్లాలోని మోకిల(mokila)లో గల తన ఇంటికి తరలిస్తారు. అభిమానుల సందర్శనార్థం సోమవారం ఫిలించాంబర్‌(filmchamber)కి తీసుకువచ్చి, ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తారు. జనవరి 26న టీడీపీ యువనేత నారా లోకేశ్‌ (Nara Lokesh) యువగళం పాదయాత్రలో తారకరత్న (Taraka Ratna) పాల్గొన్నారు.

కుప్పంలో పూజా కార్యక్రమాల అనంతరం లోకేశ్‌తో కలిసి పాదయాత్ర ప్రారంభించిన ఆయనకు హఠాత్తుగా గుండె పోటు రావడంతో కుప్పకూలారు. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణా హృదయాలయా ఆస్పత్రికి తీసుకెళ్లారు. తారకరత్నకు 23 రోజులుగా అక్కడే చికిత్సను అందిస్తున్నారు. ఆయనను కాపాడటానికి విదేశీ వైద్యబృందం శతవిధాల ప్రయత్నించారు. అయినప్పటికీ, ఆ ప్రయత్నం మాత్రం ఫలించలేదు.

Updated Date - 2023-02-18T23:35:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising